AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విబేధాలు మరచి ఒకే తాటిపై.. ఇఫ్తార్‌ విందులో సందడి చేసిన జూపల్లి, అరుణ

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఇద్దరు బడా నేతలు డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు కలయిక ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇఫ్తార్ విందులో డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ పాల్గొన్నారు.

Telangana: విబేధాలు మరచి ఒకే తాటిపై.. ఇఫ్తార్‌ విందులో సందడి చేసిన జూపల్లి, అరుణ
DK Aruna, Jupally Krishna Rao
Basha Shek
|

Updated on: Apr 13, 2023 | 7:44 AM

Share

ఇద్దరు పెద్ద నేతలు. జిల్లాలో రాజకీయాలను శాసించగల శక్తి ఉంది. నిన్నటివరకు ఆ నేతలిద్దరూ కలవలేదు. మాటలు కూడా లేవు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతే వారి మధ్య సయోధ్యని కుదిర్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కీలక నేతల కొత్త ఫ్రెండ్‌షిప్‌ స్టోరీ ఇది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఇద్దరు బడా నేతలు డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు కలయిక ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇఫ్తార్ విందులో డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ పాల్గొన్నారు. ఒకరినొకరు పలుకరించుకున్నడీకే, జూపల్లి.. కొద్దిసేపు ఇఫ్తాన్‌ విందులో పాల్గొని.. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చేసిన జూపల్లి కృష్ణారావు మరోసారి బీజేపీలోకి ఆహ్వానించారు డీకే అరుణ.

డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరిదీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లానే. గతంలో ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఒకే జిల్లా అయినప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడిచేది. ఎడముఖం పెడముఖంగా ఉండేవారు. జిల్లాలోనూ పార్టీలోనూ ఆధిపత్యం కోసం అనేక ఎత్తుగడలు హీట్‌ పుట్టించేవి. మారిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరితే.. జూపల్లి కృష్ణారావు గులాబీ గూటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ ఓడిపోయారు. అరుణ బీజేపీలోనే కొనసాగుతుండగా.. గులాబీ పార్టీలో జూపల్లికి ఎదురుగాలి వీచింది. ఇప్పుడు పార్టీ వేటు వేయడంతో.. ఈ మాజీ మంత్రిపై బీజేపీ దృష్టి పడింది. పాత అంశాలను పక్కన పెట్టారో… కలిసి సాగాలని అనుకున్నారో.. లేక పార్టీ ఆదేశాలో కానీ.. డీకే అరుణ ఇఫ్తార్‌ విందు ఇవ్వడం ఆ విందుకు జూపల్లి హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు.. రెండు రోజుల క్రితం జూపల్లి- బీఆర్‌ఎస్‌ ఎపిసోడ్‌ తర్వాత ఆమె ఫోన్‌ చేసి జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయినట్లేనా అని జిల్లా వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల