Telangana: దిశ ఎన్‌కౌంటర్ దర్యాప్తు అధికారి రాజీనామా.. ఎందుకు చేశారంటే ?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం చర్చనీయంగా మారింది. దేశవ్యాప్తంగా కీలకంగా మారిన దిశ ఘటనని షాద్‌నగర్ ఎసీపీ గా ఉండి ఇన్వెస్టిగేషన్ చేసిన సురేందర్ రాజీనామా పోలీస్ శాఖలో కలకలం రేపింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా స్పందన వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు జై కొడుతూ, పూలు చల్లుతూ పెద్ద ఎత్తున పబ్లిక్ పోలీసులకు నీరాజనం పలికారు .

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం చర్చనీయంగా మారింది. దేశవ్యాప్తంగా కీలకంగా మారిన దిశ ఘటనని షాద్‌నగర్ ఎసీపీ గా ఉండి ఇన్వెస్టిగేషన్ చేసిన సురేందర్ రాజీనామా పోలీస్ శాఖలో కలకలం రేపింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా స్పందన వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు జై కొడుతూ, పూలు చల్లుతూ పెద్ద ఎత్తున పబ్లిక్ పోలీసులకు నీరాజనం పలికారు . అలాగే ఈ దిశ కేసులో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుతో రాష్ట్ర పోలీసు ప్రతిష్ఠ పెరిగింది. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం పోలీసుల పనితీరు చాలా ఆదర్శంగా ఉందంటూ అనేకమంది మెచ్చుకున్నారు. వీటన్నిటిని చూసిన అప్పటి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి తన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఆశించాడు.
కానీ ఆయన కష్టానికి దక్కాల్సిన ఫలితం దక్కకపోగా అంతా రివర్స్ అయింది. భరోసా నమ్మకం కల్పించాల్సిన పోలీస్ బాసుల మద్దతు దొరకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు. దిశ ఎన్కౌంటర్ సమయంలో షాద్‌నగర్ ఏసిపి గా ఉన్న సురేందర్.. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత తిరిగి మంచి పోస్టింగ్ వస్తుందని అనుకున్నారు. కానీ సురేంద్రకు సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ ఏసీపీగా బదిలీ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన సురేందర్ తాను దిశ కేసులో ఇంతగా కష్టపడితే కనీసం మంచి పోస్టింగ్ ఇవ్వరా అంటూ వైరాగ్యంతో ఆయన వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు.

Surendar
ఎమ్మెల్యేల లెటర్స్ ఉంటేనే పోస్టింగ్స్.. పొలిటికల్ లీడర్ల ఆశీస్సులు ,ఎమ్మెల్యేల లెటర్లు ఉంటేనే పోలీసులకు పోస్టింగులు వస్తున్నాయంటూ ఒకవైపు పోలీస్ శాఖ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నవేళ దిశలాంటి సీరియస్ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక సీనియర్ డీఎస్పీ వీఆర్ఎస్ తీసుకోవడం తెలంగాణ పోలీస్ శాఖలో చర్చినీయాంశంగా మారింది.




ఇదిలా ఉండగా 2019, నవంబర్ 28న వెటర్నరి వైద్యురాలిగా పనిచేస్తున్న ఓ యువతిని నలుగురు యువకులు రేప్ చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను షాద్‌నగర్‌లోని చింతన్‌పల్లి వంతెన కింద ఆమె మృతదేహాన్ని కాలబెట్టారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలోనే కాదు దేశవాప్తంగా దుమారం రేపింది. నిందితులను చంపేయాలంటూ అప్పుడు నెటీజన్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీన్ రీనకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు నిందుతులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులను పోలీసులు షూట్ చేశారు. దీంతో పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం