Telangana: చెరువులో చేపలకోసం వల వేసిన మత్స్యకారులు.. తీసి చూడగా హడలిపోయే సీన్..

Telangana: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో మత్స్యకారులకు రాకాసి చేపలు కుప్పలు కుప్పలుగా లభించాయి. వింత ఆకారంలో ఉన్న రాకాసి చేపలను చూసి మత్స్యకారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెట్టుబడి పెట్టి చేపలను పెంచి తీరా చేపలను పట్టే సమయంలో..

Telangana: చెరువులో చేపలకోసం వల వేసిన మత్స్యకారులు.. తీసి చూడగా హడలిపోయే సీన్..
Fishermen
Follow us

|

Updated on: Mar 24, 2023 | 4:49 PM

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో మత్స్యకారులకు రాకాసి చేపలు కుప్పలు కుప్పలుగా లభించాయి. వింత ఆకారంలో ఉన్న రాకాసి చేపలను చూసి మత్స్యకారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెట్టుబడి పెట్టి చేపలను పెంచి తీరా చేపలను పట్టే సమయంలో చెరువులో వలలు వేసిన మత్స్యకారులకు రాకాసి చేపలు చిక్కడంతో ఒక్కసారిగా నీళ్లు నమిలారు. చేపలు పడుతుండగా వింతైన. కొత్త రకం రాకాసి (డెవిల్) చేపలు కుప్పలు, కుప్పలుగా వలలకు చిక్కుకున్నాయి.

గత వర్షాకాలంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన చేప పిల్లలను అందించి చెరువులో వేయడం జరిగింది. అయితే ఈ చేపలు పెరగకుండా అలాగే ఉండిపోయాయి. పిల్లాయిపల్లి కాల్వ నీటి ద్వారా ఈ రాకాసి చేపలు చెరువులోకి వచ్చి చెరువులోని ఇతర చేపలను బ్రతకనివ్వకుండా చేశాయి. దీంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

ప్రభుత్వం తమకు ప్రతి సంవత్సరం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్నప్పటికీ గత సంవత్సరం నుంచి ఈ రాకాసి చేపలు చెరువులోకి వచ్చి చేప పిల్లలను తినేస్తున్నాయని తమకు తీవ్ర నష్టం వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..