AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డెంగ్యూ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చర్యలు.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలా..

తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న క్రమంలో డెంగ్యూ జ్వరాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగహన కల్పించడం ద్వారా డెంగ్యూ జ్వరాల నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని..

Telangana: డెంగ్యూ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చర్యలు.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలా..
Dengue
Amarnadh Daneti
|

Updated on: Sep 07, 2022 | 5:08 PM

Share

Telangana: తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న క్రమంలో డెంగ్యూ జ్వరాల (Dengue Fever), నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగహన కల్పించడం ద్వారా డెంగ్యూ జ్వరాల నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) పరిధిలోనూ, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాలలో విస్తరిస్తున్న సీజనల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ వ్యాదులు ప్రభలకుండా నివారణ చర్యల గురించి ప్రజలను చైతన్యపరచటానికి అవగాహన, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జ్వర సర్వే (Fever Survey) నిర్వహించాలని అధికారులకు సూచనలు జారీచేసింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. ప్రతి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10గంటల 10 నిమిషాలకు ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్య కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమ సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులందరు సామాజిక భాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.

డెంగ్యూ కేసుల నిర్దారణకై రాపిడ్ కిట్స్ లను అన్ని బస్తీ దవాఖానాలలోను, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలోను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది సేవలను ఈ కార్యక్రమాల నిర్వహణలో విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ మాద్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలను, వాల్ పోస్టర్లను, రేడియో, స్ధానిక టి.వి చానళ్ళలో వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో విస్తృత ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రలు వాడాలని, పండ్ల రసాలు ఎక్కువ మొత్తంలో తీసుకోనేలా ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

డెంగ్యూ వ్యాధి లక్షణాలు: తీవ్రమైన జ్వరం , తీవ్రమైన తలనొప్పి, కంటి లోపలి భాగంలో నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాలు, కీళ్ళ నొప్పులు, చర్మంపై దద్దుర్లు, పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం , వంటి లక్షణాలు డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో ఉంటాయని.. ఇందులో కొన్ని లక్షణాలు.. జ్వరం తీవ్రత ఎక్కువుగా ఉన్నవారిలో మాత్రమే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈవిషయాలను ప్రజలకు తెలియపరిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ వ్యాధి నిర్ధారణ: డెంగ్యూ జ్వరంతో బాధపడేవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా డెంగ్యూ వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయబడునని, జ్వరం వచ్చిన మొదటి రోజు నుండి అయిదవ రోజు వరకు NS1 ఎలీసా మరియు ఆరవ రోజు నుండి IgM AC ఎలీసా పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలోని SSH సెంటర్లో ఉచితంగా చేయబడుననే విషయాన్ని ప్రజలకు తెలియపర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

డెంగ్యూ వ్యాధి వ్యాప్తి: ఎడిస్ దోమకాటు ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని, ఈ దోమలు ఇండ్లలోని, ఇంటి కృత్రిమ నీటి నిల్వ ఆవాసాలలో ఎక్కువగా పెరుగుతాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఎడిస్ దోమలు పగటివేళలో మాత్రమే కుడతాయని.. అందుకే పగటి సమయాల్లో దోమలు కుడితే జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..