Telangana: ‘విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు..’ లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే

తెలంగాణలో గత 3, 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలకు వరద ముప్పు వాటిల్లింది. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు.. వర్షం, వరద కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ నేపథ్యంలో......

Telangana: 'విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు..' లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే
Telangana Schools
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2024 | 12:21 PM

తెలంగాణలో కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా అని లేదు.. అన్ని చోట్లా వరుణుడు చెలరేగిపోతున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని.. నీట మునిగాయి. బ్యారేజీల్లో నీటి మట్టం.. గరిష్ఠ స్థాయికి చేరింది. చెరువులు, కాలువలు.. పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల గండ్లు పడ్డాయి. ఇక హైదరాబాద్‌లో.. పలు ప్రాంతాల్లో వరద ఎఫెక్ట్ ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

తెలంగాణలోని చాలా ప్రాంతాలు వరదు ముంపుకు గురయ్యాని..  నదులు, చెరువులు, వాగులు, వంకలు, తూములు, నాలాలు పొంగిపొర్లుతుండటంతో స్టూడెంట్స్.. స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని..  ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ముప్పు వాటిల్ల కుండా రెండు, మూడ్రోజులు హాలిడేస్ ఇవ్వాలని వేముల రామకృష్ణ కోరారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఇక, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.. మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.  ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్‌‌లోనూ మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. సిటీలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. తెలియని దారుల్లో వెళ్లకపోడమే మంచింది. పలు చోట్ల కరెంట్ షాక్ ఘటనలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తత అవసరం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే