Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేసింది. ముఖ్యంగా హైస్కూల్‌ వేళల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగానే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మారస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఇకపై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..
School Timings
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 22, 2024 | 12:18 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేసింది. ముఖ్యంగా హైస్కూల్‌ వేళల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగానే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మారస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఇకపై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15ల వరకు పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటి వరకు పనివేళలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45గా ఉండేవి. అయితే తాజాగా ఈ సమయాన్ని ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే మాత్రం జంట నగరాల్లో య‌థావిధిగా ఉద‌యం 8.45 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ కొన‌సాగ‌నున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో సాయంత్రం ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంగన్వాడీల్లోనూ మార్పులు..

ఇదిలా ఉంటే విద్యావస్థల్లోనూ పలు మార్పులు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా అంగన్వాడీలను మరింత తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్లే స్కూల్స్‌తో తరహాలో అంగన్వాడీలను తీర్దిదిద్దనున్నారు. అంగన్వాడీల్లోనే బోధన అందించనున్నారు. ఇందులో భాగంగానే అంగన్వాడీలో ఒక టీచర్‌ను నియమించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇక వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లపై సమీక్ష నిర్వహించిన రేవంత్‌ రెడ్డి.. సెమీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..