AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జస్ట్ రూ.1300కే మీ బట్టతలపై ఒత్తైన జుట్టు -పోటెత్తిన జనం – ఆ తర్వాత

మనుషులకు జుట్టు అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది అయితే ప్రాణం పోతుందన్నా బాధపడరు కానీ.. జుట్టు ఊడిపోతుంది అంటే తెగ దిగులుపడతారు. జుట్టు ఊడిపోయిన వారి బాధ అయితే అబ్బో వేరే లెవల్.. ఇలాంటి వారిని టార్గెట్ చేసింది ఢీల్లీ ముఠా.

Hyderabad: జస్ట్ రూ.1300కే మీ బట్టతలపై ఒత్తైన జుట్టు -పోటెత్తిన జనం - ఆ తర్వాత
కొంత మంది వెంట్రుకలు తలపై ఊడి పోకుండా రకరకాల మందులు, ప్రయత్నాలు చేస్తారు. కానీ వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో బట్టతల ఒకటని ముందుగా గుర్తు పెట్టుకోవాలి. టీవీ ప్రకటనలు చూసి నూనెలు, మందులు, ఇంజక్షన్లు వాడినంత మాత్రాన జట్టు రాదు.
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 17, 2025 | 9:17 AM

Share

హైదరాబాద్ పాతబస్తీ ఖులీ కుతుబ్‌షాహీ స్టేడియంలో బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఢిల్లీకి చెందిన సల్మాన్ దిల్లీవాలా గ్యాంగ్ మరోసారి ప్రజలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జడిబుడి పేరిట ఈ స్కామ్‌కు తెరలేపారు. తలపై జుట్టు రావడం ఖాయమంటూ రెండు రోజుల పాటు ప్రచారం దంచారు. శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున జనం గుండు చేయించుకుని పాతబస్తీలోని స్టేడియానికి చేరుకున్నారు.

రిజిస్ట్రేషన్ కోసం రూ.700.. నూనె తలకు రాసేందుకు మరో రూ.600 చొప్పున ఒక్కో వ్యక్తి వద్ద నుంచి మొత్తం రూ.1300 వసూలు చేశారు. చెట్టు నుంచి తయారుచేసిన ప్రత్యేక నూనెను తలపై రాస్తే మూడు నెలల్లో ఒత్తయిన జుట్టు వస్తుందని నమ్మబలికారు. సామాజిక మాధ్యామాల్లో ప్రచారం చేయడంతో రెండు రోజుల్లోనే 5,000-6,000 మంది ఈ శిబిరానికి హాజరయ్యారు.

గతంలో ఇదే సల్మాన్ గ్యాంగ్ ఉప్పల్, పాతబస్తీ ప్రాంతాల్లో కూడా ఈ తరహా మోసాలు చేసింది. అప్పుడు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ పాతబస్తీలో శిబిరం నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఈ వ్యవహారంపై మాకు సమాచారం వచ్చింది. తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఈ ఘటనపై స్పందించిన హుస్సేనిఆలం పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ధృవీకరించని వైద్య పద్ధతులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే