ఆ హీరోలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ ఆషికా రంగనాథ్..
Rajitha Chanti
Pic credit - Instagram
20 April 2026
కన్నడ పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆషికా రంగనాథ్. 'అమిగోస్' సినిమాతో పరిచయమైంది.
నా సామీ రంగా'తో ప్రేక్షకులకు చేరువైన ఈమె, తాజాగా రవితేజ సరసన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. కళ్యాణ్ రామ్ చాలా ప్రైవేట్ పర్సన్ అని, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది ఆషికా.
నాగార్జున చార్మింగ్ అని, అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా తోటి నటుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారని చెప్పుకొచ్చింది ఆషికా రంగనాథ్.
రవితేజ జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుంటారని, సెట్‌లో ఆయన ఉంటే సందడే వేరని పేర్కొన్నారు. కాబోయే భర్త గురించి స్పందిస్తూ ఆషికా కొన్ని ఆసక్తికర నియమాలను బయటపెట్టారు.
తనకు కాబోయే భర్త తనను గౌరవించాలని, తన నటన పట్ల ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ కెరీర్‌లో ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. అలాగే తనకు కొంచెం ఓసీడీ (OCD) ఉందని తెలిపింది.
పరిశుభ్రత విషయంలో అస్సలు రాజీపడనని, తన భాగస్వామి కూడా అలాగే ఉండాలని తెలిపారు. తాను పనిచేసిన హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ 'పర్ఫెక్ట్ హజ్బెండ్ మెటీరియల్' అని అన్నారు.
సెట్‌లో మాట్లాడేటప్పుడు ఆయన తన భార్య స్వాతి గురించి గొప్పగా చెబుతారని, తన భర్తలో కూడా కళ్యాణ్ రామ్ గారిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు ఉండాలని అన్నారు.