AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI: దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు సాధించడం ద్వారా ముంబై తరపున రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడవ ఆటగాడిగా పాండ్యా చరిత్ర సృష్టించి, తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు.

GT vs MI: దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
Gt Vs Mi Hardik Pandya
Venkata Chari
|

Updated on: Apr 20, 2026 | 9:47 PM

Share

Hardik Pandya: ముంబై ఇండియన్స్ జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన హార్దిక్ పాండ్యా, తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఒక ప్రత్యేకమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై తరపున రెండు వేల పరుగుల మార్కును చేరడానికి అతడికి కేవలం మూడు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే ఆ లక్ష్యాన్ని చేరుకుని, ముంబై ఇండియన్స్ తరపున ఈ ఘనత సాధించిన ఏడవ బ్యాటర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు ముంబై స్కౌటింగ్ విభాగం గుర్తించిన అత్యుత్తమ ప్రతిభావంతుల్లో హార్దిక్ ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

దిగ్గజాల జాబితాలో పాండ్యాకు చోటు..

ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే, రోహిత్ శర్మ ఆరు వేల పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, అంబటి రాయుడు, సచిన్ టెండూల్కర్, ఇషాన్ కిషన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన హార్దిక్ పాండ్యా కూడా చేరడం విశేషం. 126 మ్యాచ్‌ల్లో 153 స్ట్రైక్ రేటుతో హార్దిక్ ఈ రెండు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ముంబై సాధించిన నాలుగు టైటిల్ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు.

గుజరాత్ టైటాన్స్‌తో ప్రయాణం..

హార్దిక్ పాండ్యా ప్రయాణం కేవలం ముంబైకే పరిమితం కాలేదు. మధ్యలో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరించి, 2022లో ఆ జట్టుకు టైటిల్ అందించాడు. గుజరాత్ తరపున ఆడిన 31 మ్యాచ్‌ల్లో 833 పరుగులు సాధించాడు. మొత్తం మీద ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 156 మ్యాచ్‌లు ఆడిన ఈ బరోడా స్టార్, 2830 పరుగులు చేసి లీగ్‌లోనే అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, రిటైర్మెంట్ సమయానికి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే..
మీ ఇంట్లోని ఏ మూల మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఇలా చేస్తే..
ట్రైన్ కోచ్‌లపై ఉండే ఈ నెంబర్ల వెనుక అర్థం ఏంటి..?
ట్రైన్ కోచ్‌లపై ఉండే ఈ నెంబర్ల వెనుక అర్థం ఏంటి..?
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..?
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..?
'డెకాయిట్' నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా?
'డెకాయిట్' నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా?
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..