AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, దాన్ని నిలుపుకోవడం మరొక ఎత్తు. మనం నిత్యం వెంట తీసుకెళ్లే పర్సు మన అదృష్టాన్ని నిర్ణయిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. పర్సులో ఏ వస్తువులు ఉండాలి? ఏవి ఉండకూడదు? లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి పర్సు విషయంలో పాటించాల్సిన కీలక నియమాల గురించి తెలుసుకుందాం..

మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
Vastu Tips For Wallet
Krishna S
|

Updated on: Apr 20, 2026 | 9:47 PM

Share

చాలా మంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని, అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు. దీనికి కారణం మీ పర్సులో ఉండే నెగటివ్ ఎనర్జీ కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో మనం ఉంచే వస్తువులే మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. మరి పర్సును అదృష్ట భాండాగారంగా మార్చుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

బియ్యం గింజలు: శ్రేయస్సుకు చిహ్నం

వాస్తు ప్రకారం పర్సులో కొద్దిగా బియ్యాన్ని ఉంచుకోవడం అత్యంత శుభప్రదం. బియ్యం సమృద్ధికి చిహ్నం. కొన్ని బియ్యం గింజలకు కొద్దిగా పసుపు రాసి, ఒక చిన్న కాగితంలో కట్టి పర్సులో ఉంచుకోండి. దీనివల్ల అనవసర ఖర్చులు తగ్గి, డబ్బు నిలకడగా ఉంటుంది. అయితే బియ్యం గింజలు నలిగిపోకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి.

లక్ష్మీదేవి చిన్న చిత్రం

డబ్బుకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పర్సులో లక్ష్మీదేవి కూర్చుని ఉన్న చిన్న ఫోటోను ఉంచుకోండి. ఇది కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుందని నమ్ముతారు. గమనిక ఏంటంటే.. ఆ ఫోటో నలిగిపోయి ఉన్నా లేదా చిరిగిపోయి ఉన్నా వెంటనే మార్చేయాలి.

పచ్చ యాలకులు: సానుకూల శక్తికి మార్గం

యాలకులు కేవలం సువాసన కోసమే కాదు, వాస్తు ప్రకారం అవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. పర్సులో ఒకటి లేదా రెండు పచ్చ యాలకులను ఉంచడం వల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇది అదృష్టాన్ని తెచ్చిపెట్టి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

పర్సులో ఉండకూడనివి ఇవే

మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి. పర్సును చెత్త కుప్పలా మార్చకూడదు.

పాత బిల్లులు: పాత గ్యాస్ బిల్లులు, హోటల్ రశీదులు, పనికిరాని కాగితాలను పర్సులో ఉంచడం వల్ల రాహు దోషం కలిగి ఆర్థిక ప్రవాహం ఆగిపోతుంది.

చిరిగిన నోట్లు: పాతవి, చిరిగిన నోట్లను పర్సులో ఉంచుకోవడం వల్ల దారిద్య్రం వస్తుంది.

క్రమశిక్షణ: నోట్లను ఇష్టమొచ్చినట్లు మడతపెట్టకుండా, ఒక పద్ధతిలో అమర్చుకోవాలి.

పర్సు అనేది కేవలం డబ్బు దాచుకునే సాధనం మాత్రమే కాదు, అది మీ ఆర్థిక శక్తికి ప్రతిబింబం. పైన చెప్పిన చిన్న చిన్న వాస్తు పరిహారాలను పాటిస్తూ, పర్సును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే.. కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిలో సానుకూల మార్పులను గమనించవచ్చు.

Follow Us