Mocha Cyclone: గుబులు పట్టిస్తున్న మోచా తుపాను.. భారీ వర్షాలు లేదా గరిష్ఠ ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత ఉత్తరం దిశగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత ఉత్తరం దిశగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ తుపాను దిశ, వేగం, తీవ్రత, ప్రయాణించే మార్గంపై మంగళవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ఒకవేళ ఉత్తర దిశగా వెళితే ఇక్కడి తేమంతా అటువైపు వెళ్తుందని తద్వారా తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే పశ్చిమ దిశగా కదిలితే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
అయితే ఇప్పటికే రాష్ట్రంలోని సోమవారం కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. నల్గొండ జిల్లా చండూరులో 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కపల్లిలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం