AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR on Cyclone: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మరోసారి భేటీ అయ్యారు. ఇటు గులాబ్ తుఫనుపై ఉన్నతాధికారులతో సమీక్ష

CM KCR on Cyclone: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్
Cm Kcr
Balaraju Goud
|

Updated on: Sep 27, 2021 | 4:19 PM

Share

CM KCR in Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మరోసారి భేటీ అయ్యారు. నార్త్‌బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. నిన్న రాత్రి కూడా అమిత్‌షాతో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు కేసీఆర్. నిన్న జరిగిన నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల సమావేశంలోనూ.. హోమంత్రితో చర్చించారు సీఎం కేసీఆర్..

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌నూ మరోసారి కలిశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లపై చర్చించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన ఉప్పుడు బియ్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏటా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అవుతుండగా.. కేంద్రం 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తోంది. అయితే, 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కొనాలంటూ కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం ఇబ్బందిపడాల్సి వస్తోందని స్పష్టం చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కేంద్రం. రెండు మూడు రోజుల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో చర్చించి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామన్నది చెప్తామన్నారు పీయూష్ గోయల్.

మరోవైపు, తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. గులాబ్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్. పోలీస్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లో ఉన్న NDRF బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు.

Read Also…  Viral Video: నిజంగానే చించేశాడు.. స్టేజ్‌పై తన టాలెంట్ చూపించాలనుకున్నాడు.. కానీ, జరిగింది చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు..!