Viral Video: నిజంగానే చించేశాడు.. స్టేజ్‌పై తన టాలెంట్ చూపించాలనుకున్నాడు.. కానీ, జరిగింది చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు..!

Viral Video: నెట్టింట్లో వివాహాల వీడియోల సందడి రోజు రోజుకు పెరుగుతుంది. ఇందులో డ్యాన్సులకు సంబంధించిన వీడియోల హవా అయితే ఇక చెప్పనక్కర్లేదు.

Viral Video: నిజంగానే చించేశాడు.. స్టేజ్‌పై తన టాలెంట్ చూపించాలనుకున్నాడు.. కానీ, జరిగింది చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు..!
Marriage Dance Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 27, 2021 | 4:05 PM

Viral Video: నెట్టింట్లో వివాహాల వీడియోల సందడి రోజు రోజుకు పెరుగుతుంది. ఇందులో డ్యాన్సులకు సంబంధించిన వీడియోల హవా అయితే ఇక చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన డ్యాన్స్ ప్రతిభను వేదికపై చూపించాలనుకున్నాడు. కానీ, ఆ తరువాత జరిగిన సీన్ చూస్తే కచ్చితంగా మీరు నవ్వుకుంటారు. ఇతను నిజంగానే చించేశాడు అని అంటారు. ఇంటర్నెట్‌లో డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేయడంతో చాలా మంది రాత్రికి రాత్రే స్టార్‌లయ్యారు. ఈ ఎపిసోడ్‌లో మాత్రం అలా జరగలేదు.

అసలు విషయానికి వెళ్తే.. పెళ్లి వేడుకలో స్టేజ్‌పై ఇద్దరు అబ్బాయిలు డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు. ఇంతలో, ఒక బాలుడు తన ప్రతిభను స్పెషల్‌గా చూపించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో.. ఆ అబ్బాయికి కూడా తెలియదు. డ్యాన్స్‌లో భాగంగా ఓ స్టెప్పు వేసేందుకు కొద్దిగా వెనుకకు వెళ్లిన ఆ అబ్బాయి.. అమాతం ఒక్కసారిగా లేస్తాడు. దీంతో స్టేజ్‌పై చేసిన డెకరేషన్‌‌కు తన కాలు చిక్కుకుని.. అందగంగా తయారుచేసిన వేదిక కాస్త… ఎక్కడిక్కడికి చినిగిపోయి కనిపించింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఏదో చేద్దామనుకున్నాడు. కానీ, చివరికి జరిగింది ఇదన్నమాట.

ఈ ఫన్నీ వీడియో అఫిసీయల్_వైరల్‌క్లిప్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టా వినియోగదారులకు ఈ వీడియో తెగ నచ్చేసింది. దాదాపు మూడు వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లకు కూడా చూస్తున్నారు. ‘ఓ సోదరా నిజంగా చింపేశావు’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. పాపం ఏదో చేద్దామని అనుకున్నాడు.. ఏం జరిగిందో ఆయనకు కూడా తెలియదు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మీరూ ఆ వీడియోను చూసి నవ్వుకోండి..

Also Read: Viral Video: కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

Viral Video: ‘ట్రూ లవ్ నెవర్ ఎండ్స్’.. మనసులను తాకుతున్న వృద్ధ దంపతుల బాండింగ్

మహారాష్ట్రలో అద్భుతం.. ఆకాశం నుంచి జారిపడ్డ ‘గోల్డెన్ స్టోన్’ వైరల్ వీడియో: Golden stone in Maharashtra Video.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?