Cyber Crime: ఘరానా మోసం.. రూ.10 అడిగారు.. రూ.2.52 లక్షలు కొట్టేశారు.. ఉద్యోగం పేరిట మోసపోయిన హైదరాబాద్ వాసి
Cyber Crime Police: సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు...
Cyber Crime Police: సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తాజాగా ఉద్యోగం పేరుతో కుత్బుల్లార్‌కు చెందిన మహిళను సైబర్ నేరగాళ్లు నిలువునా మోసగించారు. ఉద్యోగం పేరిట సుమారు రూ.2.52 లక్షలను కాజేశారు. ఉద్యోగం కోసం నౌకరి.కామ్‌లో సదరు మహిళ తన వివరాలు నమోదు చేసింది. దీంతో సైబర్ నేరగాళ్లు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 చెల్లించాలని అడిగారు. ఇంకేముందు ఇది నిజమే అనుకున్న మహిళ.. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ క్లిక్ చేయడంతో ఖాతా నుంచి నగదు మాయమైంది. ఆమె ఖాతా నుంచి పలు విడతల వారీగా రూ.2.52 లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారని తెలిసింది.
దీంతో బాధితురాలు లబోదిబోమంటూ పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోవిడ టీకాలసైబర్ నేరగాళ్లు బంజారాహిల్స్‌కు చెందిన వస్త్ర వ్యాపారిని మోసం చేశారు. వస్త్ర దుకాణంలో సిబ్బందికి టీకాలు వేస్తామని దుండగులు రూ.1.10 లక్షలను అడిగారు. దీంతో సదరు వ్యాపారి దుండగుల ఖాతాకు నగదు పంపించారు. అనంతరం దుండగులు స్పందించకపోవడంతో బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులు నగరంలో చాలానే జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచారు.