AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephants Dead: విషాదం.. 18 ఏనుగులు మృతి.. ఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు. ఏనుగుల మరణాలపై దర్యాప్తు

Elephants Dead: పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి. ఇక అసోం రాష్ట్రంలో 18 ఏనుగులు మరణించాయి. అయితే పిడుగుపాటు..

Elephants Dead: విషాదం.. 18 ఏనుగులు మృతి.. ఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు. ఏనుగుల మరణాలపై దర్యాప్తు
Elephants Dead
Subhash Goud
|

Updated on: May 13, 2021 | 10:20 PM

Share

Elephants Dead: పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి. ఇక అసోం రాష్ట్రంలో 18 ఏనుగులు మరణించాయి. అయితే పిడుగుపాటు వల్ల మరణించి ఉంటాయని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగాన్-కర్బి ఆంగ్లాంగ్ జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో 18 ఏనుగులు మ‌ర‌ణించి ఉండ‌టాన్ని గురువారం గుర్తించిన‌ట్లు అసోం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) అమిత్ సాహే పేర్కొన్నారు. ప్రతిపాదిత కాతియాటోలి పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ స‌మీపంలోని కుండోలి ప్రాంతంలో ఏనుగులు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఒక చోట 14 ఏనుగులు, మ‌రో చోట 4 ఏనుగుల మృతదేహాల‌ను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఘటన స్థలానికి ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. ఏనుగుల మృతిపై కారణాలేంటన్నది అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు 18 ఏనుగులు పిడుగుపాటుకు మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అటవీ శాఖ మంత్రి పరిమల్‌ సుక్లబైద్యా తెలిపారు. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. తాను శుక్రవారం సంఘటన ప్రాంతాలను సందర్శిస్తామని ఆయన వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

AP Crime News: గుంటూరు జిల్లాలో దారుణం, అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ.. ఇద్ద‌రు మృతి

CP Sajjanar: అతనే ప్రధాన సూత్రధారి.. కూకట్‌పల్లి ఏటీఎం దోపిడి కేసులో ఇద్దరు అరెస్ట్: సీపీ సజ్జనార్

Follow Us
మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి!
మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి!
జియో సంచలన ప్లాన్‌.. ఇది కేవలం రూ.200కే 15 OTTలు, 30GB డేటా..!
జియో సంచలన ప్లాన్‌.. ఇది కేవలం రూ.200కే 15 OTTలు, 30GB డేటా..!
విగ్రహారాధనలోని అసలు తత్వం ఇదే.. రమణ మహర్షి
విగ్రహారాధనలోని అసలు తత్వం ఇదే.. రమణ మహర్షి
టాప్‌ 5 క్రెడిట్‌ కార్డులు ఇవే..! వీటిలో ఏది తీసుకుంటే బెస్ట్?
టాప్‌ 5 క్రెడిట్‌ కార్డులు ఇవే..! వీటిలో ఏది తీసుకుంటే బెస్ట్?
వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే
వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే
యూట్యూబ్‏లో దెయ్యం సినిమా.. ఉత్కంఠ, మలుపులతో సాగే హారర్ థ్రిల్లర్
యూట్యూబ్‏లో దెయ్యం సినిమా.. ఉత్కంఠ, మలుపులతో సాగే హారర్ థ్రిల్లర్
ఒక్క కప్పు బొంబాయి రవ్వతో అద్దిరిపోయే స్వీట్.. ఇలా చేసుకోండి..
ఒక్క కప్పు బొంబాయి రవ్వతో అద్దిరిపోయే స్వీట్.. ఇలా చేసుకోండి..
ఈ ఎలక్ట్రిక్‌కార్లు కొనాలంటే డెలివరీ కోసం 6 నెలలు ఆగాల్సిందే..
ఈ ఎలక్ట్రిక్‌కార్లు కొనాలంటే డెలివరీ కోసం 6 నెలలు ఆగాల్సిందే..
విదేశాలకు వెళ్లే యోగం.. ఈ 5 రాశుల వారికి అవకాశాలు ఎక్కువట!
విదేశాలకు వెళ్లే యోగం.. ఈ 5 రాశుల వారికి అవకాశాలు ఎక్కువట!
ప్రేమిస్తే హీరో గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
ప్రేమిస్తే హీరో గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..