Telangana Rains: తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు, వరదలు.. రంగంలోకి దిగిన భారత ఆర్మీ

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరినట్లు సోమేశ్ కుమార్ చెప్పారు. దీంతో భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం రంగంలోకి పునరావాస సహాయక చర్యల్లో పాల్గొనడానికి రెడీ అయింది.

Telangana Rains: తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు, వరదలు.. రంగంలోకి దిగిన భారత ఆర్మీ
Telangana Rains And Floods
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2022 | 4:19 PM

Telangana Rains: భారత ఆర్మీ.. దేశ సరిహద్దుల వద్ద దేశ రక్షణ చేస్తూనే.. మరో వైపు దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. తాను ఉన్నానంటూ ముందుకొస్తుంది. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఏర్పడిన సమయంలో మన జవాన్లు.. బాధితులకు తమ వంతు సహాయం అందిస్తారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు , వరదలు రికార్డ స్థాయిలో ముంచెత్తుతున్నాయి. దీంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనజీవనం స్తంభించింది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఈ ఆర్మీ బృందం పునరావాస చర్యలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరినట్లు సోమేశ్ కుమార్ చెప్పారు. దీంతో 68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రర్డీ కొత్త గూడెం జిల్లాకు వస్తున్నాయని వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలుగా ఉన్న ఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు, ఐదుగురు జేసీఓ లు, 92 వివిధ ర్యాంకుల వారున్నారని సి.ఎస్ తెలిపారు. సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక బోట్ లను సిబ్బందితో సహా భద్రార్ది జిల్లాకు పంపామని తెలిపారు. ఫైర్ విభాగానికి చెందిన 7 బోట్ లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది స్విమ్మర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి కాలరీలు ఎం.డి. ఎం. శ్రీదర్ లను ప్రత్యేక అధికారిగా నియమించామని సోమేశ్ కుమార్ అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ పునరావాస చర్యలకు ఉపయోగించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, భద్రార్డీ కొత్తగూడెం జిల్లాలతో పాటు ములుగు, భూపాల పల్లి, పెద్ద పల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సి.ఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం కలుగ కుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సి.ఎస్. అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!