AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా

పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి మాఫియా అక్రమ రవాణాకు తెరతీసింది. గంజాయి అక్రమ రవాణాకు కేటుగాళ్లు చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. రహస్య ప్రాంతాల్లో కొనుగోలు చేసి అధికారుల కళ్లు చెమర్చేలా కాన్వాయ్ తో అక్రమ గంజాయి రవాణా జరుగుతోంది. గంజాయి కేటుగాళ్ల వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు హైవేపై చేజ్ చేయాల్సి వచ్చింది.

Telangana: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా
Representative Image
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 08, 2025 | 12:57 PM

Share

ఢిల్లీకి చెందిన మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి కశ్మీరే గేట్, అక్షరదాం ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మొనిస్ ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంగల్, నూర్ మహమ్మద్, జమీల్, భాను, కన్హాయిలను ముఠాగా ఏర్పాటు చేశాడు. వీరికి ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలించే బాధ్యతను మోనిస్ అప్పగించాడు. ఇందుకోసం కార్లను సమకూర్చి ఒక్కొక్కరికి 20వేల రూపాయలను ఇచ్చాడు. ఈ ముఠా ఢిల్లీ నుంచి ఈ నెల 1వ తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అనకాపల్లికి చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి అటవీ ప్రాంతంలోని గంజాయి సరఫరాదారులతో మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా మాట్లాడి 500 కిలోల గంజాయిను సిద్ధంగా ఉంచాడు.

ఈ ముఠా.. తమ రెండు కార్లలో 250కిలోల చొప్పున నింపి ఈనెల 5న తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలతో కాన్వాయ్‌గా బయలుదేరుతారు. ఈ కాన్వాయ్‌కి ఒక కారు ఎస్కార్ట్‌గా ఉంటూ పోలీసుల తనిఖీలను గమనిస్తూ ముందుకు సాగుతుంది. ముఠా సభ్యులు రాష్ట్రాన్ని బట్టి కార్ల నెంబర్ ప్లేట్లను మారుస్తూ ప్రయాణిస్తున్నారు. ఇలా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద పోలీసులు వాహనాల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సుజన థియేటర్ సమీపంలో ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారు హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కారు వెనక వస్తున్న మరో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. విజయవాడ వైపు వేగంగా మళ్ళించారు.

కారును పట్టుకునేందుకు పోలీసులు చేజ్ చేశారు. దీంతో అక్రమార్కులు తమ కారును కట్టంగూరు మండలం కురుమర్తి వద్ద చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, పారిపోయిన ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బబ్లూ, మంగల్, ఢిల్లీకి చెందిన జమీల్, భాను, కన్నాయిగా సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గంజాయిని కార్లలో తరలిస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసి కోటి రూపాయల విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి చెప్పారు. రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన నిందితులను గంజాయిని త్వరలోని పట్టుకుంటామని ఆయన తెలిపారు.

ఇది చదవండి: ఫేస్ క్రీమ్ కావాలంటూ షాప్‌లోకి వచ్చాడు.. ఒంటరిగా ఉన్న ఆమెను చూసేసరికి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి