Telangana: ఆ పొత్తు అక్కడి వరకే.. మా ప్రయోజనాలు మాకుంటాయి. . సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలకు ఓ నిర్ధిష్టమైన వైఖరి లేదంటూ అనేక విమర్శలు వస్తున్నాయి. ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఏం.. తెలంగాణలో అధికారిక టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు..

Telangana: ఆ పొత్తు అక్కడి వరకే.. మా ప్రయోజనాలు మాకుంటాయి. . సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు
Kunamneni Sambasiva Rao, CPI
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 13, 2022 | 12:28 PM

ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలకు ఓ నిర్ధిష్టమైన వైఖరి లేదంటూ అనేక విమర్శలు వస్తున్నాయి. ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఏం.. తెలంగాణలో అధికారిక టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. దీంతో గతంలో కమ్యూనిస్టులను తీవ్రంగా విమర్శించిన కేసీఆర్‌తోనూ జతకట్టారంటూ విమర్శలు చేయడంతో పాటు.. కమ్యూనిస్టు పార్టీలు ప్రజా ఉద్యమాలను వదిలి.. నాయకుల స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు సైతం వచ్చాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవడం, అది కూడా పది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో వామపక్షాల మద్దతు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ సాగుతూ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత.. తాము విజయం సాధించకపోయినా.. విజయాన్ని నిర్ధేశించగలమనే కాన్ఫిడెన్స్ వామపక్ష పార్టీల్లో కన్పించింది. దీంతో రాష్ట్రస్థాయి నాయకుల్లో కొంత ఊపు కన్పించింది. వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి సిద్ధాంత పరంగా బీజేపీ కావడంతో.. ఆ పార్టీని వ్యతిరేకించే ఎవరికైనా మద్దతు ప్రకటిస్తామని వామపక్ష నాయకులు చెబుతూ వస్తున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత.. తెలంగాణలో టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయనే భావన అందరిలో కలుగుతోంది. అయితే తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

మునుగోడు ఎన్నికల వరకు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని, భవిష్యత్ లో పొత్తులు ఉంటాయో లేదో తెలియదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇప్పటి వరకు పొత్తులపై ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. తమ ఎత్తుగడలు, ప్రయోజనాలు తమకు ఉంటాయని చెప్పారు. మమ్మల్ని తోక పార్టీలు అన్నవారి తోక కత్తిరిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఏడు వేల మంది సిపిఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారని, తాము ఏమి తప్పు చేశామని అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. తాము దోపిడి దారులమా.. దొంగలమా అంటూ ఫైర్ అయ్యారు కూనంనేని సాంబశివరావు. కొందరికి కమ్యూనిస్టులను తిట్టడం ఫ్యాషన్ అయ్యిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో రెండేళ్ల క్రితమే ఉత్పత్తి ప్రారంభం అయ్యిందని తెలిపారు. కేంద్రప్రభుత్వ వైఖరి, మోదీ పాలనపై విమర్శలు గుప్పించారు.

భద్రాద్రి జిల్లా కోయగూడెం బొగ్గు గనులను సింగిల్ టెండర్ కే అరబిందో కు కట్టబెట్టారని, ఈ గనుల్లో ఉత్పత్తి చేయకుండా తాము అడ్డుకుంటామన్నారు. శ్రావణ పల్లి, మందమర్రి, కళ్యాణ గని, సత్తుపల్లి ఓసి3 లతో పాటు.. దేశంలో 500 బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయడానికి గుర్తించారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..