Telangana News: తహసీల్దార్‌పై అవినీతి ఫిర్యాదు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న లేఖ.. రియాక్షన్ ఏంటంటే..

Telangana News: మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్‌పై ట్విట్టర్ ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆ ఆరోపణల లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Telangana News: తహసీల్దార్‌పై అవినీతి ఫిర్యాదు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న లేఖ.. రియాక్షన్ ఏంటంటే..
Letter
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2021 | 9:36 AM

Telangana News: మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్‌పై ట్విట్టర్ ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆ ఆరోపణల లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. జన్నారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ పుష్పలత అవినీతికి పాల్పడుతున్నారంటూ పలువురు ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.

భూముల రిజిస్ట్రేషన్ విషయంలో 5 నుంచి 10 వేలు లంచం తీసుకుంటున్నారని, లంచం ఇవ్వనిదే పని చేయడం లేదంటూ పలువురు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలపై తహసీల్దార్ పుష్పలత స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ పుష్పలత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు తనను, కార్యాలయ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు తహసీల్దార్ పుష్పలత ఒక ఆడియో రిలీజ్ చేశారు.

Also read:

Gulab Cyclone Live Updates: గులాబ్ సైక్లోన్ లైవ్ అప్డేట్స్ : ప్రచండ వేగంతో దూసుకొస్తోన్న తుఫాను..

Rana Daggubati: సరికొత్త అవతారం ఎత్తనున్న రానా.. విరాట పర్వం కోసం కొత్త ప్రయోగం..

Viral Video: ఖడ్గమృగాల కొమ్ములకు నిప్పు పెట్టారు.. ఎందుకలా చేశారో తెలిస్తే ఆశ్చర్యం! వీడియో