AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై మరికొన్ని రోజులు అప్రమత్తత అవసరం..! వైద్యాధికారుల సమీక్షలో మంత్రి ఈటల..

Minister Etela Rajender : ప్రజలందరు కరోనాపై మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

కరోనాపై మరికొన్ని రోజులు అప్రమత్తత అవసరం..! వైద్యాధికారుల సమీక్షలో మంత్రి ఈటల..
Minister Etela Rajender
uppula Raju
|

Updated on: Apr 14, 2021 | 4:18 PM

Share

Minister Etela Rajender : ప్రజలందరు కరోనాపై మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. వైద్య సిబ్బంది మరికొన్ని రోజులు యుద్దప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి , వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలన్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో ఉన్న ఆశ వర్కర్లు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఉన్న డాక్టర్లు కరోనా వైరస్ రోగులను గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు.

టెస్టింగ్ ట్రీతింగ్ ట్రాకింగ్ వాక్సినేషన్ లతో పాటు, ఇతర వైద్య సేవలు కూడా అందిస్తూ నిరంతర బిజీగా వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయి డాక్టర్లకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఆశా వర్కర్లకు, ప్రాథమిక ఆరోగ్య స్థాయి డాక్టర్లకు, సిబ్బందికి అవసరమైన పర్సనల్  కేర్ ఎక్విప్మెంట్ లు అన్ని సకాలంలో అందేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాల్లో టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ లో ఆక్సిజన్, ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని కోరారు.  సాధ్యమైనంతవరకు ఎక్కువ మంది పేషెంట్లను హోమ్ ఎలివేషన్ లో ఉంచే విధంగా కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. సీరియస్ అయిన పేషెంట్లకు ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. చనిపోయిన వారిను వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు.  స్థానిక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల తో సమన్వయం చేసుకొని మృతదేహాలను అందించాలని సూచించారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈసారి వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల గుంపులుగా చెరవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కువమంది ఒకే  ప్రాంతాల్లో గుమికూడినప్పుడు ఏ ఒక్కరికి కరోనా వైరస్ వచ్చిన అందరికీ పరీక్షలు చేసే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు.

Sachin Vaze: పేలుడు పదార్ధాల కారు.. పోలీసు అధికారి సచిన్ వాజే.. సస్పెన్స్ థ్రిల్లర్ రియల్ క్రైమ్ స్టోరీలో మరో ట్విస్ట్!

కొత్త డైరెక్టర్‏తో ఈసారి సీరియస్‏గా వస్తానంటున్న శర్వా.. మరోసారి పోలీస్‏గా యంగ్ హీరో..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..