AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Vaze: పేలుడు పదార్ధాల కారు.. పోలీసు అధికారి సచిన్ వాజే.. సస్పెన్స్ థ్రిల్లర్ రియల్ క్రైమ్ స్టోరీలో మరో ట్విస్ట్!

కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది.

Sachin Vaze: పేలుడు పదార్ధాల కారు.. పోలీసు అధికారి సచిన్ వాజే.. సస్పెన్స్ థ్రిల్లర్ రియల్ క్రైమ్ స్టోరీలో మరో ట్విస్ట్!
Sachin Vaze
KVD Varma
|

Updated on: Apr 14, 2021 | 4:09 PM

Share

Sachin Vaze: కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజే విషయంలో మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. సచిన్ వాజే  ఎన్  కౌంటర్ సెప్షలిస్ట్ గా పేరుపొందారు. ఆయన ఇప్పుడు ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన కుట్ర ఒకటి వెలుగులోకి వచ్చింది. సచిన్ వాజే మరో ఇద్దర్ని హతమార్చేందుకు కుట్ర పన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇద్దరు వ్యక్తుల్ని చంపి ఎన్  కౌంటర్ గా చిత్రీకరించేందుకు ఆయన వ్యూహం పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. కానీ, ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో రెండో ప్లాన్ అమలు చేశారని చెబుతోంది.

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్ధాల వాహనం కేసులో ప్రధాన నిందితుడిగా సచిన్ వజేను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో అయన ఇంటి నుంచి ఒక వ్యక్తి పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు కొత్త ట్విస్ట్ అనుభవంలోకి వచ్చింది. పాస్ పోర్టు లోని వ్యక్తి తో పాటు మరో వ్యక్తిని సచిన్ వాజే హతమార్చేందుకు కుట్ర పన్నారని తేలింది. ముకేశ్ అంబానీ ఇంటిదగ్గర కారును వీరిద్దరే నిలిపారని చిత్రీకరించి తరువాత వీరిని ఎన్  కౌంటర్ చేయాలని సచిన్ వాజే ప్లాన్ చేశారని గుర్తించింది ఎన్ఐఏ. ఇలా చేసి పేలుడు ప్రదార్ధాల కేసును ముగించిన క్రెడిట్ కొట్టేయాలని అయన భావించినట్లు అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

రెండో ప్లాన్.. మొదట ఔరంగాబాద్ లో దొంగిలించిన మారుతీ కారులో బాంబులు అమర్చి ముఖేష్ అంబానీ ఇంటి ఎదుట నిలపాలని ప్లాన్ వేశారు సచిన్ వాజే. ఈ కారును ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలిపి వెళ్ళిపోవాలి. అయితే, ఇది కుదరలేదు. దీంతో రెండో ప్లాన్ అమలు చేశారు. ఫిబ్రవరి 25న పేలుడు పదార్ధాలతో ఉన్న ఓ ఎస్ యూ వీ కారును అక్కడ ఉంచాయారు. దానిని పోలీయేసులు సాదీనం చేసుకున్నారు. అయితే, ఆ కారు యజమాని మన్ సుఖ్ హిరేన్ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఈ కేసులో వాజే కీలక నిందితుడిగా దర్యాప్తు చేసిన అధికారులు గుర్తించారు. కేసును త్వరగా ఛేదించిన గుర్తింపు తెచ్చుకోవడం కోసం సచిన్ వాజే చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టి పోలీసులకు దొరికిపోయారు. అయితే, దర్యాప్తులో సచిన్ వాజే చాలామంది సీనియర్ పోలీసు అధికారుల పేర్లు వెల్లడించారని తెలుస్తోంది. దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది.

Also Read: Akhilesh Yadav Covid-19 positive : మాజీ ముఖ్యమంత్రి.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్లో అభ్యర్థన

NEET PG 2021: నీట్‌ పీజీ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల.. ఇలా సులువుగా డౌన్‌లౌడ్‌ చేసుకోండి..