AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York: నా బిడ్డను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుమతి ఇవ్వండి.. కోర్టులో షాకింగ్ పిటిషన్!

రోజు రోజుకూ మానవ సంబంధాలు ఎలా మంట కలిసిపోతున్నాయి అనడానికి ఇదో ఉదాహరణ. కలికాలం.. అనాలో ఇంకేం అనాలో అర్ధంకాని పరిస్థితి ఒక్కో విషయం వింటే అనిపిస్తుంది.

New York: నా బిడ్డను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుమతి ఇవ్వండి.. కోర్టులో షాకింగ్ పిటిషన్!
New York
KVD Varma
|

Updated on: Apr 14, 2021 | 4:23 PM

Share

New York:  రోజు రోజుకూ మానవ సంబంధాలు ఎలా మంట కలిసిపోతున్నాయి అనడానికి ఇదో ఉదాహరణ. కలికాలం.. అనాలో ఇంకేం అనాలో అర్ధంకాని పరిస్థితి ఒక్కో విషయం వింటే అనిపిస్తుంది. అటువంటి విషయమే ఇది. వయసుకు వచ్చిన తన బిడ్డను పెళ్లి చేసుకుంటానంటూ ఒకరు కోర్టుకు వెళ్లడం ఇప్పుడు అందరికీ షాకిచ్చింది.

కన్న తల్లిదండ్రులు.. తోబుట్టువులు ఒకరినొకరు పెళ్లిచేసుకోవడం.. లైంగిక సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అనైతికం. అయినప్పటికీ కోర్టుకు అందిన ఒక లేఖలో తాను వయసుకు వచ్చిన తన బిడ్డను పెళ్లిచేసుకుంటాను అంటూ ఉంది. అది చూసిన న్యాయమూర్తులకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇలా కన్నబిడ్డను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటూ వారు మండి పడుతున్నారు.

న్యూయార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై అందరూ పిదపకాలం.. అంటూ ఫైర్ అవుతున్నారు. మన్హాట్ ఫెడరల్ కోర్టులో ఈ లేఖ విచారణకు వచ్చింది. కానీ, ఈ లేఖ రాసిన వ్యక్తి తాను ఆ బిడ్డకు తల్లా? తండ్రా అనేవిషయ్మ్ తెలియచేయలేదు. అదేవిధంగా ఆ బిడ్డ ఆడా..మగా అనేది కూడా పేర్కొలేదు. కానీ, ఈ ఉత్తరం సామాజికంగా అనైతిక చర్య.. జీవశాస్త్ర పరంగా చాలా అశ్యకరమైన చర్య అని దీన్ని ఆమోదిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయంటూ కోర్టులో అనేక మంది తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సంబంధం కలిగివున్నా.. వివాహమనే శాస్వత బంధంతో మరింత సాన్నిహిత్యంగా, ఆధ్యాత్మికంగా గడపవచ్చు’’ అని ఆ పిటీషన్‌లో ఉంది. అయితే, ఆ పిటీషన్‌లో కనీసం వారు నివసిస్తున్న ప్రాంతం పేరును కూడా రాయలేదు. వారి మధ్య ప్రస్తుతం ఎలాంటి బంధం ఉందనేది కూడా స్పష్టంగా ఇవ్వలేదు. అసలు ఈ లేఖ రాసిన వారు ఎందుకోసం పెళ్లి చేసుకోవాలని కుంటున్నారు? లైంగిక జీవితం కోసమా? లేక మరేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియరాలేదు. అయితే, ఈ లేఖరాసిన వారు తాము పెద్ద వయసువారిమే అని పేర్కొన్నారు. మొత్తమ్మీద ఈ లేఖ ఉదంతం న్యూయార్క్ లో సంచలనం సృష్టించింది.

Also Read: Minors in cyber crime: విద్యార్థుల భవితపై కమ్మేస్తున్న “నీలి”నీడలు.. అశ్లీల చిత్రాలకు అట్రాక్ట్ అవుతూ జైలుపాలవుతున్న మైనర్లు

అతీత శక్తులు వస్తాయని స్నేహితురాలినే పెళ్లాడింది.. కన్న బిడ్డలను బలివ్వబోయింది.. చివరికి ఏం జరిగిందంటే..