అతీత శక్తులు వస్తాయని స్నేహితురాలినే పెళ్లాడింది.. కన్న బిడ్డలను బలివ్వబోయింది.. చివరికి ఏం జరిగిందంటే..
Black Magic: తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. మూఢ నిమ్మకాల నేపథ్యంలో ఓ వివాహిత తన మిత్రురాలినే పెళ్లి చేసుకుంది. అంతేకాదు..
Black Magic: తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. మూఢ నిమ్మకాల నేపథ్యంలో ఓ వివాహిత తన మిత్రురాలినే పెళ్లి చేసుకుంది. అంతేకాదు.. ఆమెతో కలిసి తన ఇద్దరు కొడుకులను చిత్ర హింసలకు గురి చేసింది. వీరి దురాగతానికి ఆమె భర్త కూడా సహకరించడం కొసమెరుపు. ఈ ముగ్గురూ కలిసి తమ ఇద్దరు కుమారులను అత్యంత పాశవికంగా బలిచ్చేందుకు యత్నించారు. వీరి చర్యలను పసిగట్టిన చిన్నారులు తెలివిగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ దారుణ ఘటన గురించి బాధిత చిన్నారులు చెప్పిన వివరాలు వింటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌లో నివాసం ఉంటున్న రామలింగం, రంజిత దంపతులకు దీపక్(15), కిషాంత్(6) ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రామలింగం కు ఇందుమతి అనే మహిళతో రెండో వివాహం జరిగింది. వీరికి మూఢ నమ్మకాలు అధికం. ఈ నేపథ్యంలోనే రామలింగం తన రెండో భార్య ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మిని.. మొదటి భార్య రంజితకు పరిచయం చేశాడు. మీరిద్దరూ శివుడు, పార్వతిలా ఉన్నారంటూ వారికి మాటలు చెప్పుకొచ్చాడు. అలా ఇంట్లోనే తన కుమారుల ఎదుట వారిద్దరికీ(రంజితకు, ధనలక్ష్మికి) వివాహం జరిపించాడు రామలింగం. వీరిద్దరికీ పెళ్లి చేస్తే అతీత శక్తులు వారి వశం అవుతాయని భావించారు. ఇందుకోసం ఆ చిన్నారులచేత ధన లక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామా అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు.
రంజిత ఆ చిన్నారులిద్దరినీ స్కూల్‌కు పంపేది కాదు. ఇంట్లోని పనులన్నీ పిల్లతోనే చేయించేవారు. ఆ చిన్నారులచే శానిటైజర్ తాగించడం, ఒంటికి కారం పూసి ఎండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు తల్లి రంజిత పాల్పడేదని చెబుతూ బాధిత చిన్నారులు వాపోయారు. అంతేకాదు.. మూఢ నమ్మకాల పిచ్చిలో రామలింగం, రంజిత, ధనలక్ష్మి ముగ్గురూ కలిసి ఆ చిన్నారులిద్దరినీ నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. వీరి చర్యలను గమనించిన దీపక్, కిషాంత్.. చాకచక్యంగా ఇంట్లోంచి తప్పించుకున్నారు. వారి తాత ఇంటికి చేరుకుని జరిగిన విషయం అతనికి చెప్పారు. చిన్నారులతో కలిసి వారి తాత పోలీసులను ఆశ్రయించాడు. ఈరోడ్ ఎస్పీ తంగదురైకి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రంజిత, ధనలక్ష్మి, రామలింగం అరెస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్ పిల్లలతో అడవి శేషు.. లైవ్‌లో రిలేషన్ పై స్పందించిన రేణు దేశాయ్