AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: పవన్ కళ్యాణ్ పిల్లలతో అడవి శేషు.. లైవ్‌లో రిలేషన్ పై స్పందించిన రేణు దేశాయ్

Renu Desai: కర్మ సినిమాతో వెండి తెరపై నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు అడివి శేషు. మల్టీటాలెంటెడ్ పర్సన్ బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ వంటి సినిమాల్లో నటించిన శేషు మంచి...

Renu Desai:  పవన్ కళ్యాణ్ పిల్లలతో అడవి శేషు.. లైవ్‌లో రిలేషన్ పై స్పందించిన రేణు దేశాయ్
Adavi Seshu With Adya
Surya Kala
|

Updated on: Apr 14, 2021 | 8:21 AM

Share

Renu Desai: కర్మ సినిమాతో వెండి తెరపై నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు అడివి శేషు. మల్టీటాలెంటెడ్ పర్సన్ బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ వంటి సినిమాల్లో నటించిన శేషు మంచి నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అడవి శేషు హీరోగా శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో నటిస్తున్న మేజర్ సినిమాతో బిజీగా ఉన్నారు.  అయితే శేషుకు మంచి గుర్తింపు తెచ్చింది ముందుగా పవన్ కళ్యాణ్ పంజా మూవీ.. అప్పటి నుంచి పవన్ ఫ్యామిలీ తో శేషుకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్యతో శేష్ చాలా క్లోజ్ గా ఉంటాడు. రేణు దేశాయ్ కూడా శేష్ కు మంచి స్నేహితురాలు. ఇక అడివి శేష్ అకిరా, ఆద్యలను కలుస్తూ. సరదాగా గడుపుతుంటాడు. మేజర్ టీజర్ లాంచ్ కు ముందు రేణుదేశాయ్ తన పిల్లలతో శేష్ ఉన్న ఫోటోలను షేర్ చేసారు. ఆ ఫోటో తో పాటు శేషు అన్నకి మేజర్ టీజర్ లాంచ్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

అయితే మరోవైపు రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చింది. దీంతో అభిమానులు వదినా అంటూ పలకరించారు. పలు ప్రశ్నలు వేశారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అడుగుతూనే .. మరోవైపు కొంతమంది అడవి శేషుతో ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించారు.

అడవి శేషుతో అకిరా, ఆద్యల రిలేషన్ గురించి చెప్పమని అడిగిన వాళ్ళకి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు రేణు. రాశాం కదా.. అన్న అని .. అడవి శేషు అంటే అన్న అని చెప్పారు.. అయితే మరొకరు మళ్ళీ అదే విషయం పై ప్రస్తావించగా.. మీకు తెలుగులో చెబితే అర్ధం కావడం లేదా.. తెలుగు రాదా అని అన్న అంటే బ్రదర్ అంటూ కొంచెం గట్టిగానే చెప్పారు రేణు.. ఇక ఆద్య లైవ్ లో కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ.. తెలుగులో మాట్లాడమని మని కోరారు.. దీంతో ఆద్య తెలుగులో కొంచెం సేపు మాట్లాడింది.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read:  సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్ల సందడి మొదలు. అయితే మేకప్ కరిగిపోకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..

శానిటైజర్ ఎక్కువగా వాడుతున్నారా.. ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా..!