Covid Cases: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్క రోజే ఎన్ని నమోదయ్యాయంటే..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20గా ఉండగా.. ఈరోజు కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది.

Covid Cases: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్క రోజే ఎన్ని నమోదయ్యాయంటే..
Corona In Telangana
Follow us
Srikar T

|

Updated on: Dec 22, 2023 | 10:01 PM

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20గా ఉండగా.. ఈరోజు కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే.. హైదరాబాద్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు అధికారులు. రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ సోకింది. నిలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

క‌రోనా కేసులు అల‌జ‌డి సృష్టిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప‌దేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబ‌డ్డ వారు జాగ్రత్తగా ఉండాల‌ని, అన‌వ‌స‌రంగా త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు రాకూడద‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధ‌రించాల‌ని ఆదేశించింది. జ్వరం, ద‌గ్గు, జ‌లుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్తితే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని సూచించింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉందని అధికారికంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..