Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే 10వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష.. హైదరాబాద్ సీపీ మాస్ వార్నింగ్..
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటిగంట లోపు న్యూఇయర్ వేడుకలు ఆపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పబ్‌లు, బార్లలో డ్రగ్స్ వాడితే సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటామన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే పదివేల జరిమానా లేదంటే ఆరు నెలల జైలుశిక్ష ఉంటుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటిగంట లోపు న్యూఇయర్ వేడుకలు ఆపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పబ్‌లు, బార్లలో డ్రగ్స్ వాడితే సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటామన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే పదివేల జరిమానా లేదంటే ఆరు నెలల జైలుశిక్ష ఉంటుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కాగా.. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని.. పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. 31వ తేదీన వేడుకల దృష్ట్యా చాలా ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. అంతేకాకుండా.. పబ్బులు, ఈవెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇప్పటికే సర్కులర్ ను సైతం జారీ చేశారు. ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ గతంలోనే సూచించారు. అంతేకాకుండా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ దందా పై ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు.. పలువురిని అరెస్టు కూడా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..