Supreme Court : తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు కోర్టు ధిక్కరణ నోటీసులు

సుప్రీంకోర్టు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారానికి సంబంధించి విచారణ సందర్భంగా కోర్టు..

Supreme Court : తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు కోర్టు ధిక్కరణ నోటీసులు
TRANSCO
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 29, 2021 | 4:49 PM

TS Genco and Transco : సుప్రీంకోర్టు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారానికి సంబంధించి విచారణ సందర్భంగా కోర్టు ఈ ధిక్కరణ నోటీసులు పంపింది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ… 84 మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ మేరకు కోర్టు నిర్ణయం తీసుకుంది. 1,150 మంది ఉద్యోగులను 2 రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేయగా… ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని ఏపీ ప్రభుత్వం చేర్చుకున్నట్లు పిటిషనర్లు కోర్టుకు చెప్పారు.

84 మందిని మినహాయించి మిగిలిన వారిని తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోవడంతో.. వీరంతా ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో.. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు.. ఎస్పీడీసీఎల్​ (SPDCL)సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్‌ కార్యాలయ అధికారి గోపాలరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జులై 16కి వాయిదా వేసింది.

Read also : Chiranjeevi : చిరంజీవి గురించి వచ్చిన వార్తలన్నీ అచ్చి అబద్ధం.. ఎఐసిసి, ఎపిసిసి స్పష్టీకరణ