టికెట్ తీసుకోమన్నందుకు మహిళా కండక్టర్‌పై కానిస్టేబుల్ దాడి

టికెట్ తీసుకోమన్నందుకు మహిళా కండెక్టర్‌పై కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ ఘటన మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో జరిగింది. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సులో..

టికెట్ తీసుకోమన్నందుకు మహిళా కండక్టర్‌పై కానిస్టేబుల్ దాడి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 05, 2020 | 9:03 PM

టికెట్ తీసుకోమన్నందుకు మహిళా కండెక్టర్‌పై కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ ఘటన మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో జరిగింది. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సులో కానిస్టేబుల్ రామకృష్ణ గౌడ్ ఎక్కాడు. ఆ తర్వాత కాసేపటికే బస్సులో కండక్టర్ శ్రీలత.. కానిస్టేబుల్‌ని టికెట్టు తీసుకోమంది. అయితే దానికి కానిస్టేబుల్.. ‘నన్నే టికెట్ తీసుకోమంటావా?’ అంటూ మహిళా కండక్టర్‌పై విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా మహిళా కండెక్టర్ మీద దాడికి కూడా దిగాడు. దీంతో వెంటనే మహిళా కండక్టర్ స్థానిక పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు ప్రయాణికులు కూడా.. తాము ఎంత వారిస్తున్నా.. ఆ కానిస్టేబుల్ ఆగకుండా మహిళా కండక్టర్‌తో వాగ్వాదం చేసుకున్నాడని.. అందులోనూ అప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నాడని వారు పోలీసులతో పేర్కొన్నారు. కాగా.. గత కొద్ది రోజుల క్రితం కూడా ఏపీలోని చిత్తూరులో కూడా మహిళా కండక్టర్‌ టికెట్ తీసుకోమన్నందుకు ఓ ప్రయాణికుడు కూడా దాడి చేశాడు. అప్పట్లో ఈ వార్త వైరల్ కూడా అయ్యింది.

ఇది కూడా చదవండి: జబర్దస్త్ కమెడియన్లకు సీరియస్ వార్నింగ్.. ‘పిచ్చి కతలు’ పడితే..