బిగ్ బ్రేకింగ్ : జైలుకు రేవంత్.. 14రోజుల రిమాండ్..
మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ వద్ద డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన కేసులో.. రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. అంతకు ముందు ఆయన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు.. ఆ తర్వాత గోల్కొండ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆయన్ని ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పర్చారు. దీంతో న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. […]
మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ వద్ద డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన కేసులో.. రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. అంతకు ముందు ఆయన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు.. ఆ తర్వాత గోల్కొండ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆయన్ని ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పర్చారు. దీంతో న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు ఆయన్ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు.. గోల్కొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. విచారించిన న్యాయమూర్తి.. రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా.. బుధవారం నార్సింగ్ పోలీసులు.. మంత్రి కేటీఆర్ లీజ్ తీసుకున్న ఫాంహౌస్ వద్ద డ్రోన్‌లతో చిత్రీకరించిన విషయంలో.. రేవంత్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డితో పాటుగా.. కృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఓంప్రకాష్‌రెడ్డి, రాజేష్, శివలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11ఏ, రెడ్ విత్ 5ఏతో పాటుగా.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ కూడా చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీలో అక్రమంగా డ్రోన్ ఎగురవేసినందుకుగాను వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇప్పటికే గోపన్‌పల్లి భూకుంభకోణంలో కూడా రేవంత్ బ్రదర్స్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.