పలు జిల్లాల్లో అకాల వర్షం.. పంటలకు తీవ్రనష్టం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షం పడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, వరంగల్ నగరంలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా కాజీపేట్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షం పడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, వరంగల్ నగరంలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా కాజీపేట్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. మిర్చి, వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం, నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో వడగండ్ల వాన కురిసింది.