AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Data theft: వాట్సాప్, ఫేస్‌బుక్ కాకుండా.. భారత్‌కు సొంత సోషల్‌ మీడియా..ఎందుకంటే?

ఆన్‌లైన్ ప్రపంచంలో హ్యాకింగ్ మరియు డేటా దొంగతనం కేసులు పెరుగుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం సొంత సోషల్‌ మీడియా(సామాజిక మాధ్యమాలు)ను రూపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Data theft: వాట్సాప్, ఫేస్‌బుక్ కాకుండా.. భారత్‌కు సొంత సోషల్‌ మీడియా..ఎందుకంటే?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 11:07 PM

Share

Data theft: ఆన్‌లైన్ ప్రపంచంలో హ్యాకింగ్ మరియు డేటా దొంగతనం కేసులు పెరుగుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం సొంత సోషల్‌ మీడియా(సామాజిక మాధ్యమాలు)ను రూపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌ సొంత సామాజిక మాధ్యమాలను రూపోందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు టెక్ మహీంద్రా సీటీఓ, జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో దుబే మాట్లాడుతూ..దేశంలో సొంత ఫేస్‌బుక్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్‌ లాంటి వాటిని రూపకల్పన చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

వ్యక్తిగత డేటా భారీగా భారతదేశం నుండి బయటికి రావడంతో.. దేశంలో సామాజిక మాధ్యమాలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో డ్రాఫ్ట్‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. సొంత సామాజిక మాధ్యమాలు రూపొందించే దేశాలలో చైనా ముందుంజలో ఉందని, చైనాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పనిచేయదని దుబే తెలిపారు. పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us