T Congress: తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ వార్ రూమ్ టీం.. సునీల్ కనుగోలు వ్యూహం ఫలించేనా..?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడి వార్‌రూమ్ కీలక పాత్ర పోషించింది. స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ ఆక్టివిటీస్‌లో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్‌లో అభ్యర్థుల ఎంపికలో అతని సర్వేలు కీలకంగా పని చేస్తాయి. అందుకే తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేకంటే ముందు సునీల్ కనుగోలు టీం సమర్థవంతమైన అభ్యర్థులు ఎవరు అనేది ఒక సర్వే నిర్వహించింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడి వార్‌రూమ్ కీలక పాత్ర పోషించింది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ లో కర్ణాటక ఎన్నికల ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపికలో అతని సర్వేలు కీలకంగా పని చేశాయి. అందుకే ఆయన సేవలను తెలంగాణలో కాంగ్రెస్ వినియోగించుకుంటుంది. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేకంటే ముందు సునీల్ కనుగోలు టీం సమర్థవంతమైన అభ్యర్థులు ఎవరు అనేది ఒక సర్వే నిర్వహించింది. నియోజకవర్గాల వారీగా టాప్ ఫైవ్ మెంబర్స్‌ని సునీల్ కనుగోలు టీం సర్వేల ఆధారంగా ఎంపిక చేసింది. అందులో నుంచి టాప్ త్రీ లిస్టును ఏఐసీసీకి పంపించగా.. ఢిల్లీలో పార్టీ పెద్దలు 119 అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచార వ్యూహాల్లో సునీల్ కనుగోలు టీం తలమునకలై ఉంది.
హైదరాబాద్ గాంధీభవన్‌కి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో 350 మంది సభ్యులతో కూడిన వార్ రూమ్ టీమ్ బెంగుళూరు నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. గాంధీ భవన్‌లోని ఇందిరభవన్ వార్ రూంను సునీల్ కనుగోలు టీం సందర్శించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. మొత్తం 30 గ్రూపులుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసారు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.
ఒక్కో టీంలో 10 మంది సభ్యులు.. అలా 30 టీంలలో 300 మంది సభ్యులు ఉండనున్నారు. 50 మందిని వార్ రూంకి పరిమితం చేశారు. ప్రతి బృందం ఒక్కో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తుంది. నిర్దిష్ట ప్రాంతాల్లో సరైన వ్యూహంతో పాల్గొంటాయి. స్పీచ్‌లు, కేసీఆర్ వైఫల్యాలపై మరో టీమ్ పని చేస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ పథకాల్లోని వైఫల్యాలను ఎండగట్టేందుకు మరో టీంను సిద్దం చేస్తున్నారు. ఈ టీమ్‌లన్నీ సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్లనున్నాయి. పార్టీతో పాటూ అభ్యర్థి వీక్‌గా ఉన్న చోట కూడా ప్రత్యేక కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు.
ఇలా సునీల్ కనుగోలు వార్ రూం సెంట్రిక్‌గా తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేసినట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కీలకంగా వ్యవహరించిన సునీల్ రాజకీయ వ్యూహాలు.. తెలంగాణ ఎన్నికల్లో కూడా అప్లై చేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..