Telangana: ఇంట్లో దావత్ అని మందు కొంటున్నారా.? ఇలా చేయకపోతే చర్యలు తప్పవు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మద్యం అమ్మకాలపై అధికారులు దృష్టిపెట్టారు. ఏదైనా పార్టీ నిర్వహిస్తే ముందుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్‌లో రాజకీయ పార్టీలు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఆబ్కారీ శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసే వాళ్లు ముందస్తుగా తమకు..
ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, వేడుకలు జరిగితే మద్యం ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో కుటుంబ సభ్యులు మందు పార్టీలు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే సాధారణ రోజుల్లో ఎంత మద్యం కొనుగోలు చేసినా, పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు ఉండరు. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆబ్కారీ శాఖ మద్యం విక్రయాలపై దృష్టిసారించింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మద్యం అమ్మకాలపై అధికారులు దృష్టిపెట్టారు. ఏదైనా పార్టీ నిర్వహిస్తే ముందుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్‌లో రాజకీయ పార్టీలు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఆబ్కారీ శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసే వాళ్లు ముందస్తుగా తమకు.. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 100 బాండ్ పేపర్‌పై ఈ విషయాన్ని స్పష్టం చేయాలి.
నిబంధనలు పాటించకుండా ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోళ్లు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో ఎలాంటి హామీ పాత్రం లేకుండానే అనుమతి ఇచ్చేవారు. రూ. 12 వేలు చెల్లించి స్థానిక ఆబ్కారీ అధికారులకు దరఖాస్తు చేసే అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయాలతో సంబంధం లేదని బాండ్ రాసిస్తేనే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కొన్ని పార్టీల నాయకులు అధికారులను బురిడికొట్టిస్తున్నారు. మద్యం పార్టీలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనలకు విరుద్దమని తెలిసి.. పుట్టినరోజు వేడుకలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలను నిర్వహిస్తున్నారు. ఫంక్షన్ హాల్స్, రిసార్డులను అద్దెకు తీసుకొని పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..