AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Politics: రేవంత్ రెడ్డిని ‘ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ’ అంటూ ఓవైసీ మండిపాటు

ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది తెలంగాణలో పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి. పార్టీ నేతల ప్రచారాలతో వీధులన్ని మార్మోగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకు చడీచప్పుడు లేకుండా పాతబస్తీకే పరిమితం అవుతూ క్యాంపెయిన్ చేస్తున్న ఎంఐఎం అధినేత తాజాగా ప్రచారంలో స్పీడ్ పెంచి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు పాతబస్తీ హైదరాబాద్ రాజకీయం ముఖచిత్రంలో సెంట్రిక్‌గా మారింది.

Hyderabad Politics: రేవంత్ రెడ్డిని 'ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ' అంటూ ఓవైసీ మండిపాటు
Owaisi Brothers Vs Revanth Reddy Political War In Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 14, 2023 | 9:14 AM

Share

ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది తెలంగాణలో పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి. పార్టీ నేతల ప్రచారాలతో వీధులన్ని మార్మోగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకు చడీచప్పుడు లేకుండా పాతబస్తీకే పరిమితం అవుతూ క్యాంపెయిన్ చేస్తున్న ఎంఐఎం అధినేత తాజాగా ప్రచారంలో స్పీడ్ పెంచి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు పాతబస్తీ హైదరాబాద్ రాజకీయం ముఖచిత్రంలో సెంట్రిక్‌గా మారింది.

గత కొద్దిరోజులుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరిగి, అది కాస్తా ప్రమాణాల వరకు వెళ్లిందంటే వారిద్దరి మధ్య వార్ ఎంతలా ముదిరిందో అర్ధం చేసుకోవచ్చు. ఓ రోజు పార్టీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అసద్ జన్మస్థలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్‌ది అసలు తెలంగాణ కాదని వాళ్ల ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి వలస వచ్చిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలతో అసలు దుమారం స్టార్ట్ అయింది. ముందు మీ నేతల సంగతి ఏంటి? రాహుల్ ఎక్కడ పుట్టారు? సోనియా గాంధీ జన్మస్థలం ఎక్కడంటూ తనదైన స్టైల్లో ప్రశ్నలు సంధించారు అసద్. దీంతో ఇద్దరి నేతల మధ్య వార్ పిక్స్ చేరింది. అంతటితో తగ్గని అసద్, రేవంత్ రెడ్డి రక్తంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని విమర్శించారు. అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముందు ఏబీవీపీ (ABVP) నుంచి ఆర్ఎస్ఎస్ (RSS)లో చేరారని, ఆ తర్వాత బీజేపీ వాళ్లు ఆయన్ను టీడీపీలోకి పంపించారని, అక్కడ వాళ్ల పని పూర్తి కావడంతో కాంగ్రెస్ గూటికి చేరారని అన్నారు అసదుద్దీన్. రేవంత్ ప్రతి మూమేంట్ వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు.

రేవంత్ కామెంట్స్‌పై స్పందించారు అక్బదుద్దీన్ ఓవైసీ. రేవంత్ పలు పార్టీలు మారడంతో రేవంత్ ఆర్ఎస్ఎస్ (RSS) టిల్లు అంటూ పేరు పెట్టారు. ఎన్నికల ప్రచారంతో పాల్గొన్న అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్ఠాయిలో విరుచుకుపడ్డారు. ఇంకా మా జోలికొస్తే రేవంత్ నీ హిస్టరీ మొత్తం బయపటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ఓవైసీ బ్రదర్స్. ఆర్ఎస్ఎస్ (RSS)తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఛాలెంజ్ చేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీపై విమర్శలు గుప్పించారు. గోషామాల్‌లో రాజాసింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు.గతంలో అసద్‌కి ఖాసీం రజ్వీ అని పేరు పెట్టాడు రేవంత్ రెడ్డి. దీనిపై సీరియస్ అయినా అసదుద్దీన్, రేవంత్ రెడ్డి అన్నా ఆర్ఎస్ఎస్ (RSS) అంటూ సంభోదించారు.

ఇవి కూడా చదవండి

అయితే గోషామహాల్‌లో ఎంఐఎం పోటీ చేయలేకపోవడాన్ని అధిస్టానాన్ని ప్రశ్నిస్తూ కొంద మంది ఆ పార్టీ లీడర్లు జీర్ణించుకోలేక పార్టీని వీడారు.  అక్కడ పోటీ చేయకపోవడంపై ఇంకా ఎంఐఎం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. తాజాగా తనపై విసిరిన ఛాలెంజ్‌పై రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. నేను హిందువుని. నేను భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తా. దర్గాకి రమ్మన్నా వస్తా. భాగ్యలక్ష్మి టెంపుల్ రమ్మన్నా వస్తా!. కానీ కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారు. పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా? అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే వీరి మధ్య వార్ పొలిటికల్ టర్న్ తీసుకుంది.

పాత బస్తీలో కాంగ్రెస్ చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ నేపథ్యంలో ముస్లిం డిక్లరేషన్ కూడా ప్రకటించారు. దీనిపై కూడా ఓవైసీ విమర్శులు చేశారు. అయితే నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటన స్థలిని పరిశీలించడానికి వచ్చిన కాంగ్రెస్ నేత ఫైరోజ్‌ ఖాన్‌ను అడ్డుకున్నారు ఎంఐఎం కార్యకర్తలు దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే ఎన్నికలు కొన్ని రోజుల్లో ఉండటంతో పాతబస్తీలో పాలిటిక్స్‌లో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..