Telangana: వేడెక్కుతోన్న రాజకీయం.. తెలంగాణలో మకాం వేయనున్న కాంగ్రెస్ అగ్ర నేతలు..
కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభల చొప్పున సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అందుకే స్థానిక నాయకులతో పాటు ఢిల్లీ నుంచి కూడా అధినాయకత్వం హైదరాబాద్‌లో మకాం చేయబోతోంది. నవంబర్లో మొత్తం 60 సభలో వరకు నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది...
ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ఇక ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటా పోటీ ప్రచార సభలతో అన్ని పార్టీలు ముందుకెళుతున్నాయి. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏఐసీసీ టాప్ క్యాడర్ తెలంగాణలో మకాం వేయనుంది. ఈ నెల 17 నుంచి రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర ముఖ్య నేతలు తెలంగాణలో ఉండి పలు సభలు నిర్వహించబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభల చొప్పున సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అందుకే స్థానిక నాయకులతో పాటు ఢిల్లీ నుంచి కూడా అధినాయకత్వం హైదరాబాద్‌లో మకాం చేయబోతోంది. నవంబర్లో మొత్తం 60 సభలో వరకు నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకి రెండు హెలికాప్టర్లను కేటాయించింది ఏఐసీసీ. ఇప్పటికే ఒక హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభల చొప్పున తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అందుకు అనుగుణంగానే కార్యచరణ రూపొందించబోతోంది. ప్రస్తుతం చత్తీస్గడ్‌లో ఎన్నికల నేపథ్యంలో అధినాయకత్వం అక్కడ ఉన్నారు. చత్తీస్గడ్ ఎన్నికలు 17వ తేదీన ముగియనుండడంతో రాహుల్, ప్రియాంక తెలంగాణకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 17 నుంచి రాహుల్ హైదరాబాద్‌లో ఉండబోతున్నట్టు సమాచారం. ఇక రాహుల్, ప్రియాంకతో పాటు మల్లికార్జున ఖర్గే తెలంగాణ టూర్ ని షెడ్యూల్ చేస్తున్నారు. సుమారు ఆరు రోజులపాటు ముగ్గురు తెలంగాణలోనే ఉండి పలు సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే సభలు ఉండేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ 15 రోజుల్లో సోనియాగాంధీతో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ టీమ్ ఒకటి తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది. వివిధ రాష్ట్రాల రాష్ట్రాలలో గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన నాయకులు ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పనులపై పనిచేస్తున్నారు. మీడియా, వార్ రూమ్ ఆక్టివిటీ, పబ్లిసిటీ, టూర్ షెడ్యూల్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా 119 నియోజకవర్గాల్లో ఏఐసిసి వారు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించబోతున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలు తెలంగాణలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిసి డిక్లరేషన్ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలంగాణలో పర్యటించారు. సిద్ధరామయ్యతో మరొక టూర్ ని ప్లాన్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ తెలంగాణలో రెండుసార్లు పర్యటించారు.
మొదట తాండూర్, పరిగి, చేవెళ్ల కార్నర్ మీటింగ్స్ పాదయాత్రలో పాల్గొన్న డీకే శివకుమార్ తెలంగాణలోని ఆరు గ్యారెంటీలు కర్ణాటకలోని ఆరు గ్యారెంటీలకంటే అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన రోజే డీకే శివకుమార్ కూడా కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా వరుస సభలతో ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. రాహుల్ ప్రియాంక మల్లికార్జున్ ఖర్గేలకు సంబంధించిన టూర్ షెడ్యూల్ వార్ రూమ్ డిజైన్ చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..