CM KCR: డబ్బు సంచులు పంపిస్తుందటా.. మొదటిసారి షర్మిలపై ఫైర్ అయిన సీఎం కేసీఆర్.. ఏమన్నారంటే..?
ఔర్ ఏక్ దక్కా.. హ్యాట్రిక్ పక్కా.. మూడోసారి జయం మాదే అంటూ కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ టాప్‌గేర్‌లో ప్రచారం నిర్వహిస్తోంది. నామినేషన్ల ఘట్టం తరువాత కేసీఆర్ రెండో విడతక్యాంపెయినింగ్‌లో గులాబీదళం కదం తొక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ దమ్మపేట, బూర్గంపాడ్, నర్సంపేటలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్నారు.
ఔర్ ఏక్ దక్కా.. హ్యాట్రిక్ పక్కా.. మూడోసారి జయం మాదే అంటూ కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ టాప్‌గేర్‌లో ప్రచారం నిర్వహిస్తోంది. నామినేషన్ల ఘట్టం తరువాత కేసీఆర్ రెండో విడతక్యాంపెయినింగ్‌లో గులాబీదళం కదం తొక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ దమ్మపేట, బూర్గంపాడ్, నర్సంపేటలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. వైఎస్ షర్మిల టార్గెట్‌గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగం ఆగం కావద్దు ఆలోచించి ఓటు వేయాలి. పార్టీల చరిత్ర, అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయ్యాలంటూ సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతమ్మ సాగర్ ద్వారా ప్రతి ఎకరా నీరు అందిస్తామన్నారు.
తొలివిడత ఖమ్మం జిల్లా పర్యటనలో తుమ్మ ముల్లు-పువ్వాడ మాటతో నవ్వులు పూయించారు కేసీఆర్. ఆయన మాటంటే తుమ్మల ఏకంగా తమ్మ పాటతో ప్రచారం నిర్వహించారు. తాజాగా బూర్గంపాడు వేదికగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ తన స్టయిల్‌లో కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.. ఆ ఇద్దరికి ఈ ఎన్నికల్లో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు అహంకారంతో మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమంటున్నారు.. ఆ ఇద్దరికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ కేసీఆర్ కోరారు.
అటు నర్సంపేట ప్రజాశీర్వాద వేదికగా కేసీఆర్ ఫస్ట్ టైమ్ షర్మిల పేరును ప్రస్తావించారు. డబ్బు కట్టలు గెలవాలా.. సుదర్శన్ గెలవాలా ఆలోచించుకోండంటూ ప్రజలను కోరారు. వైఎస్ షర్మిల అనే ఆమె పెద్ద సుదర్శన్ రెడ్డి మీద పగ పెంచుకుందట.. ఆయనను ఓడించేందుకు డబ్బు సంచులు పంపిస్తుందటా.. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి గెలవాలా.. వైఎస్ షర్మిల పంపించే డబ్బు సంచులు గెలవాలా..? పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి ఇచ్చే నోట్ల కట్టలు గెలవాలా..?.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
రైతుబంధు, దళిత బంధును ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ హామీలను నమ్మితే ఏమవుతుందో కర్నాటక రైతులు కళ్లకు కడుతున్నారన్నారు. కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే… వాళ్ల గారడీ హామీలను నమ్మి గాయ్ గాయ్ కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్. తొలివిడత 41 సభల్లో ప్రసంగించిన కేసీఆర్.. దూస్రా టూర్‌లో అంతకు మించి స్పీడ్‌ను పెంచుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..