TS Congress: కాంగ్రెస్ యాడ్స్‌పై ఈసీ నిషేధం.. న్యాయ పోరాటం చేస్తామంటూ..
'తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు' అంటూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలను రూపొందించింది. టీవీ ఛానల్స్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలను ప్లే చేస్తున్నారు. అయితే ఈ యాడ్స్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అభ్యంతంరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది...
‘మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి’ అంటూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కొన్ని ప్రకటనలపై నిషేధం విధించింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
‘తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలను రూపొందించింది. టీవీ ఛానల్స్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలను ప్లే చేస్తున్నారు. అయితే ఈ యాడ్స్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అభ్యంతంరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం 9 ప్రకటలను రూపొందించగా.. అందులో రెండు యాడ్స్‌పై ఈసీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి ప్రకటనలను టీవీ ఛానెల్స్‌లో ప్లే చేయొద్దు అంటూ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
దీనిపైనే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే, నోటీసు ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రకటలను బ్యాన్ చేయటం సరికాదని వాదిస్తోంది. ఎన్నికల ప్రచారాలను బీఆర్ఎస్ , బీజేపీ కలిసి ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి నిలివేయలని కాంగ్రెస్ మండిపడింది. ఎమ్‌సీఎన్‌సీలో మీడియా సర్టిఫికెట్ ఇచ్చిన ప్రచారాలను ఆపమనటం కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతోంది. ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌తో కలిసి బీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రచారంలో భాగంగా.. మెట్రో ట్రైన్స్‌లో ప్రకటనలు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ పార్టీ అడ్డుకుందని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల వైఫల్యాలను, కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజల్లోకి వెళ్లకుండా కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అంటోంది. ప్రకటనలు ఆపినంత మాత్రాన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి పోదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈసీ సూచనల మేరకు ప్రకటనల్లో మార్పులు చేసినా, మళ్లీ వంకలు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఈ విషయంపై ఎన్నికల సంఘం.. సీఈఓ వికాస్ రాజ్‌ని సంప్రదిస్తామని, న్యాయం జరగక పోతే కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ చెబుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..