Telangana: చేతులు జోడించి చెబుతున్నా.. ఆ పని మాత్రం చేయకండి.. కాంగ్రెస్ తెలంగాణ నేతలకు దిగ్విజయ్ విజ్ఞప్తి..

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుల మధ్య అంతర్గత విబేధాలపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో ఆయన గురువారం, శుక్రవారం పలువురు నాయకులతో మాట్లాడి.. పార్టీలో విబేధాలపై చర్చించారు. ఈరోజు పార్టీ నాయకులతో కలిసి..

Telangana: చేతులు జోడించి చెబుతున్నా.. ఆ పని మాత్రం చేయకండి.. కాంగ్రెస్ తెలంగాణ నేతలకు దిగ్విజయ్ విజ్ఞప్తి..
Digvijay Singh
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 23, 2022 | 11:35 AM

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుల మధ్య అంతర్గత విబేధాలపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో ఆయన గురువారం, శుక్రవారం పలువురు నాయకులతో మాట్లాడి.. పార్టీలో విబేధాలపై చర్చించారు. ఈరోజు పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నేతల మధ్య బేధాభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడాలని పార్టీ నాయకులకు సూచించారు. విబేధాలపై బయట మాట్లాడవద్దని.. తాను చేతులు జోడించి చెబుతున్నానంటూ దిగ్విజయ్ సింగ్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్నా.. అంతర్గతంగానే చర్చించుకోవాలన్నారు. తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈ సమయంలో నాయకులంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే.. ప్రత్యర్థుల్ని ఓడించగలమన్నారు.

తెలంగాణ ఇస్తామన్న మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, కేసీఆర్‌ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ లేదన్నారు. 2004లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ 2014లో నిలబెట్టుకుందన్నారు. తెలంగాణ ప్రజలను సీఏం కేసీఆర్ మోసం చేశారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్రంలో ఒకలా.. ఢిల్లీలో మరోలా ప్రవర్తిస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ దోస్తి చేస్తోందని విమర్శించారు. బయట మాత్రమే కుస్తీ చేస్తున్నట్లు నటిస్తున్నారన్నారు. కేసీఆర్ అమలు చేస్తామన్న 12 శాతం ముస్లీం రిజర్వేషన్లపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం దేశ వ్యాప్తంగా పోటీ చేస్తోందన్నారు. కమలం పార్టీకి ఓవైసీ పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని దిగ్విజయ్ సింగ్‌ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్ రెడ్డి తెచ్చిన రిజర్వేషన్లతో ముస్లీంలకు లబ్ధిచేకూరిందన్నారు. దేశంలో ఎన్నో జరగరాని ఘటనలు జరుగుతున్నా.. ఎంఐఎం మాట్లాడటం లేదన్నారు. బీజేపీకి మద్దతు పలికేందుకే బీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేశారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను అందిస్తోందని ఆరోపించారు. మోదీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..