AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌పై పోలీసులకు వీహెచ్‌ ఫిర్యాదు

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత రావు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 25వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో.. భారతదేశంలో ఉన్న 130కోట్ల మంది హిందువులేనంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వీహెచ్ ఫిర్యాదు చేశారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ […]

ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌పై పోలీసులకు వీహెచ్‌ ఫిర్యాదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 31, 2019 | 12:45 AM

Share

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత రావు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 25వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో.. భారతదేశంలో ఉన్న 130కోట్ల మంది హిందువులేనంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వీహెచ్ ఫిర్యాదు చేశారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే ఫిర్యాదుపై ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, న్యాయ సలహా తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

కాగా, డిసెంబర్ 25వ తేదీన సరూర్ నగర్‌ స్టేడియంలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10వేల మందికి పైగా హాజరయ్యారు. అంతకుముందు 8వేల మంది స్వయం సేవకులు మూడు శ్రేణులుగా విడిపోయి.. 10 కిలోమీటర్ల మేర పథ సంచలన్ చేశారు. ఈ సభలోనే భగవత్ ఎన్నార్సీ, పౌర సవరణ చట్టాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా తదుపరి మ్యాచ్ ఎప్పుడు? ప్రత్యర్థి ఎవరు?
టీమిండియా తదుపరి మ్యాచ్ ఎప్పుడు? ప్రత్యర్థి ఎవరు?
ఏపీ ఐసెట్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే
ఏపీ ఐసెట్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే
అక్కడ పది రోజుల పాటు చికెన్‌, ఎగ్స్‌ తినకపోవడం మంచిది..
అక్కడ పది రోజుల పాటు చికెన్‌, ఎగ్స్‌ తినకపోవడం మంచిది..
రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా? చట్టం ఏం చెబుతోంది?
రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా? చట్టం ఏం చెబుతోంది?
విశ్వవిజేత రేసులో ఇండియాకు ఆ మూడు దేశాల నుంచే ముప్పు
విశ్వవిజేత రేసులో ఇండియాకు ఆ మూడు దేశాల నుంచే ముప్పు
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?