AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్ ఎందుకు ఆపేశారు?

India vs Namibia T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో పసికూన యూఎస్ఏ చేతిలో ఓడిపోయేంత పని చేసిన టీమిండియా, ఇప్పుడు తన రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడనున్న భారత్, మ్యాచ్‌కు ముందు అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Team India : టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్ ఎందుకు ఆపేశారు?
Team India
Rakesh
|

Updated on: Feb 09, 2026 | 6:53 AM

Share

India vs Namibia T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో పసికూన యూఎస్ఏ చేతిలో ఓడిపోయేంత పని చేసిన టీమిండియా, ఇప్పుడు తన రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడనున్న భారత్, మ్యాచ్‌కు ముందు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 9) జరగాల్సిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌ను జట్టు రద్దు చేసుకుంది. అసలే బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో సూర్య సేన ప్రాక్టీస్‌కు ఎందుకు దూరంగా ఉందనే చర్చ ఇప్పుడు మొదలైంది.

ప్రాక్టీస్ రద్దు వెనుక అసలు కారణం ఏంటి?

భారత జట్టు తన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవడం వెనుక అధికారికంగా ఎటువంటి పెద్ద కారణం చెప్పనప్పటికీ, గ్రౌండ్ లభ్యత ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 10న ఇదే అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ చిన్న జట్లకు ప్రాక్టీస్ కోసం మైదానాన్ని కేటాయించాల్సి రావడంతో, భారత్ తన సెషన్‌ను వదులుకుంది. సోమవారం ఉదయం నమీబియా, సాయంత్రం నెదర్లాండ్స్ జట్లు తమ ట్రైనింగ్‌ను పూర్తి చేయనున్నాయి. బీసీసీఐ ఈ రోజును ఆటగాళ్లకు డే ఆఫ్‎గా ప్రకటించింది.

యూఎస్ఏ మ్యాచ్ పాఠాలు

తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి, 77 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరిన వేళ భారత్ ఓటమి అంచున నిలిచింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ తన వీరోచిత 84 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆదుకోబట్టి సరిపోయింది. లేదంటే టీమ్ ఇండియాకు తొలి రోజే పెద్ద అవమానం జరిగేది. ఈ నేపథ్యంలో నమీబియా వంటి జట్లను కూడా తక్కువ అంచనా వేయకూడదని అభిమానులు సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. ప్రాక్టీస్ మానేయడం కంటే లోపాలను సరిదిద్దుకోవడం ముఖ్యమని వారు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 10న ఫుల్ ప్రాక్టీస్

సోమవారం రెస్ట్ తీసుకున్నప్పటికీ, మంగళవారం (ఫిబ్రవరి 10) మాత్రం భారత జట్టు పూర్తి స్థాయిలో మైదానంలోకి దిగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేడియంలో ఫ్లడ్ లైట్ల కింద టీమిండియా ప్రాక్టీస్ చేయనుంది. నమీబియాతో జరగబోయే మ్యాచ్ రాత్రి పూట కాబట్టి, ఆ సమయానికి తగ్గట్టుగా మంగళవారం సెషన్‌ను ప్లాన్ చేశారు. ఈసారి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ నెట్స్ లో ఎక్కువ సమయం గడపనున్నారు.

బీసీసీఐ కండీషన్స్

ప్రాక్టీస్ సెషన్‌తో పాటు సోమవారం జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కూడా బిసిసిఐ రద్దు చేసింది. దీనివల్ల మీడియా ప్రతినిధులకు ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కేవలం వ్యూహాలను గోప్యంగా ఉంచడానికే ఈ నిర్ణయమా లేక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించడానికా అనేది స్పష్టంగా తెలియదు. అయితే, 12వ తేదీ మ్యాచ్ కావడంతో 10, 11 తేదీల్లో టీమ్ ఇండియా ముమ్మరంగా శ్రమించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!