AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ICET 2026 Notification: ఏపీ ఐసెట్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. అప్లికేషన్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

ఏపీ ఐసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు ప్రకగనత విడుదల చేసింది. ఈ ఏడాది ఐసెట్‌ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఐసెట్‌ ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో..

AP ICET 2026 Notification: ఏపీ ఐసెట్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. అప్లికేషన్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
Andhra Pradesh ICET 2026 Notification
Srilakshmi C
|

Updated on: Feb 09, 2026 | 7:37 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు ప్రకగనత విడుదల చేసింది. ఈ ఏడాది ఐసెట్‌ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఐసెట్‌ ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మార్చి 2, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఏపీ ఐసెట్‌)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎంసీఏకు మాత్రం ఇంటర్‌ లేదా డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.750, బీసీ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.650 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక మే 2న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్య తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 2వ తేదీన వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ.1000 ఆలస్య రుసుముతో: మార్చి 7, 2026 వరకు.
  • రూ.2000 ఆలస్య రుసుముతో: మార్చి 12, 2026
  • రూ.4000 ఆలస్య రుసుముతో: మార్చి 17, 2026
  • రూ.10,000 ఆలస్య రుసుముతో: మార్చి 21, 2026
  • కరెక్షన్‌ విండో: మార్చి 23, 2026.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: ఏప్రిల్ 15, 2026.
  • రాత పరీక్ష తేదీ: మే 2, 2026.
  • ప్రిలిమినరీ కీ విడుదల తేదీ: మే 5, 2026 సాయంత్రం 5 గంటలకు
  • ఫలితాలు విడుదల తేదీ: మే 16, 2026.

ఏపీ ఐసెట్‌ 2026 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ ఐసెట్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే
ఏపీ ఐసెట్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే
అక్కడ పది రోజుల పాటు చికెన్‌, ఎగ్స్‌ తినకపోవడం మంచిది..
అక్కడ పది రోజుల పాటు చికెన్‌, ఎగ్స్‌ తినకపోవడం మంచిది..
రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా? చట్టం ఏం చెబుతోంది?
రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా? చట్టం ఏం చెబుతోంది?
విశ్వవిజేత రేసులో ఇండియాకు ఆ మూడు దేశాల నుంచే ముప్పు
విశ్వవిజేత రేసులో ఇండియాకు ఆ మూడు దేశాల నుంచే ముప్పు
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్