AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భ‌ట్టి పీపుల్ మార్చ్.. 86 రోజులు.. 1000 కిలోమీటర్లు

తెలంగాణలో భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..ప్రజలకు కాంగ్రెస్‌పై మరింత భరోసాను కల్పిస్తూ సాగుతోంది భట్టి యాత్ర. గత నెల 16న ఆదిలాబాద్‌జిల్లా పిప్పిరి నుంచి పీపుల్స్‌మార్చ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే.

Telangana: భ‌ట్టి పీపుల్ మార్చ్.. 86 రోజులు.. 1000 కిలోమీటర్లు
Bhatti Vikramarka Mallu
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2023 | 3:56 PM

Share

తెలంగాణలో హస్తం పార్టీ పూర్వవైభవమే లక్ష్యంగా కొనసాగుతున్న CLP నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ యాత్ర సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. మార్చి 16న భట్టి నేతృత్వంలో ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి నుంచి ప్రారంభమైన యాత్ర బోథ్, ఖానాపూర్, ఆసిపాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల మీదుగా 200 కిలోమీటర్లు కొనసాగి..మంచిర్యాల నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గంలోని మెట్‌పల్లి గ్రామ శివారులో 250 కిలోమీటర్ల మైలురాయిని దాటిన..భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర ఏప్రిల్ 16న మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి బ్రిడ్జి పైన  300 కిలోమీటర్ల పూర్తి చేసుకుంది. అదే ఉత్సాహంతో తండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల ప్రజలను పలకరిస్తూ ఏప్రిల్ 29 జనగామ జిల్లా నార్మెట్ట వద్ద 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నది.

దారిలో రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళల సమస్యలను వింటూ, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ యాత్ర కొనసాగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకుసాగుతున్నారు బట్టి. మే 25న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్వేందర్ సింగ్ సుక్ ముఖ్య అథిధిగా వచ్చారు. మన సంపద మనకే, మన కొలువులు మనకే అని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే, ఇక్కడి సంపదను కేసీఆర్‌ దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు బట్టి. గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు కలుస్తూ.. వారి సమస్యలు వింటూ ఆయన ముందకు సాగుతున్నారు.

జూన్ 10న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా దేవరకొండలో నిర్వహించే సభకు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రంజిత్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర కంప్లీట్ అవ్వనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవ్వనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..