డబ్బుతోనే రాజకీయాలు.. ఇక నేను పోటీ చేయను.. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Chinna Reddy sensational comments: నేటి రాజకీయాలు డబ్బుతోనే ముడిపడాయన్న సంగతి తెలిసిందే. జనాధరణ కంటే.. డబ్బు ఆదరణే ఎక్కువ లబ్ధి చేకూరేలా చేస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి

  • Shaik Madarsaheb
  • Publish Date - 3:00 pm, Sat, 20 March 21
డబ్బుతోనే రాజకీయాలు.. ఇక నేను పోటీ చేయను.. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Dr.g.chinna Reddy

Chinna Reddy sensational comments: నేటి రాజకీయాలు డబ్బుతోనే ముడిపడాయన్న సంగతి తెలిసిందే. జనాధరణ కంటే.. డబ్బు ఆదరణే ఎక్కువ లబ్ధి చేకూరేలా చేస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. డబ్బులు లేకపోతే ఎవరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయవద్దని.. ఇది తన విన్నపమని తెలిపారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం తనకు చాలా బాధ కలిగిస్తోందని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదంటూ వ్యాఖ్యానించారు. తన పలుకుబడి కేవలం 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానంటూ విస్మయం వ్యక్తంచేశారు.

డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరన్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తట్టుకోగలరన్నారు. జానారెడ్డి కూడా పద్దతి మార్చుకొని.. డబ్బులు కుమ్మరించాలని సూచించారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని, కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేసిన చిన్నారెడ్డి ఎలిమినేషన్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read:

CM KCR Assembly announcement : అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రకటనపై ఉత్కంఠ, గంపెడాసెలు పెట్టుకున్న ఉద్యోగులు, ఇతర వర్గాలు

Warangal: ఎంజీఎంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.. చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ మృతి