AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Biryani: బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

బిర్యానీ అంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు ముందు వెనుక ఆలోచించకుండా లొట్టలేసుకుంటూ మరి తింటారు.. ఇక హైదరాబాద్ బిర్యానీ ఇక మరింత ఆసక్తి కనబరుస్తారు.. ఏదిఏమైనా.. బిర్యానీ టెస్ట్.. స్మెల్.. అహో అనాల్సిందే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Chicken Biryani: బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Chicken Biryani
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2025 | 1:42 PM

Share

బిర్యానీ అంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు ముందు వెనుక ఆలోచించకుండా లొట్టలేసుకుంటూ మరి తింటారు.. ఇక హైదరాబాద్ బిర్యానీ ఇక మరింత ఆసక్తి కనబరుస్తారు.. ఏదిఏమైనా.. బిర్యానీ టెస్ట్.. స్మెల్.. అహో అనాల్సిందే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా.. ఆహార పదార్థాలను సర్వ్ చేస్తుండటంతో.. బయట తినాలంటేనే ప్రజలు జంకుతున్నారు.. ఇటీవల ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నప్పటికీ.. ఆహార నాణ్యత విషయంలో హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజులే ఫుడ్ సేఫ్టీ అధికారుల హాడావుడి అంటూ లైట్ తీసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ తయారీలో ప్రాణాంతక రసాయనాలు, కుళ్లి పోయిన పదార్థాలు ఉపయోగిస్తున్నారు.. అంతే కాకుండా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచడంతో ఆహారంలో పురుగులు, బొద్దింకలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది..

తాజాగా జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. ఓ వ్యక్తి బిర్యానీ తినాలని రెస్టారెంట్‌కు వెళ్లి ఆర్డర్ ఇచ్చాడు.. వెయిటర్ కూడా చకచకా బిర్యానీని సర్వ్ చేశాడు.. ప్లేట్‌లో ఉన్న బిర్యానీని తిందామని అలా చేయి పెట్టాడో లేదో.. అక్కడ కనిపించింది చూసి దెబ్బకు కంగుతిన్నాడు.. బిర్యానీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఇష్టా రెస్టారెంట్‌లో జరిగింది..

Cockroach Found In Chicken

Cockroach found in chicken biryani

ఓ కస్టమర్.. రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీని ఆర్డర్ చేసి తినేందుకు రెడీ అయ్యాడు.. ఇంతలోనే చికెన్ బిర్యానీలో బొద్దింక కనబడటంతో ఒక్కసారిగా నివ్వెరపోయాడు. వెంటనే.. ఆ ప్లేట్ అలా ఉంచి.. ఇదేంటంటూ రెస్టారెంట్ సిబ్బంది, మేనేజ్‌మెంట్‌ను నిలదీశాడు.. అయినప్పటికీ.. వారు ఏం తెలియనట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని.. బాధిత కస్టమర్ పేర్కొన్నాడు..

ఈ ఘటన అనంతరం వెంటనే కిచెన్‌లోకి వెళ్లి చూడగా అపరిశుభ్రమైన వాతావరణం కనిపించిందని.. ఈగలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్నాయంటూ కస్టమర్ పేర్కొన్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!