CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..!
మూసీ నదికి తిరిగి ప్రాణం పోసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎటువంటి వ్యతిరేకత రాకుండా.. పునరుజ్జీవానికి పునాది పడేలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. బాపూఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్, అలాగే మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న ఆధునిక బ్రిడ్జి నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మరి.. మూసీపై తెలంగాణ సర్కార్ ఎలా ముందుకు వెళ్లబోతుంది? పునురుజ్జీవానికి పునాది ఎక్కడ పడబోతుంది?

మూసీ నదికి తిరిగి ప్రాణం పోసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎటువంటి వ్యతిరేకత రాకుండా.. పునరుజ్జీవానికి పునాది పడేలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. బాపూఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్, అలాగే మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న ఆధునిక బ్రిడ్జి నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మరి.. మూసీపై తెలంగాణ సర్కార్ ఎలా ముందుకు వెళ్లబోతుంది? పునురుజ్జీవానికి పునాది ఎక్కడ పడబోతుంది?
మూసీ పునరుజ్జీవంను ప్రస్టేజ్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మూసీ పరివాహకంలో నిర్మాణాలకు చెక్ పెట్టిన సర్కార్.. ఇక నదీ గర్భంతో పాటు.. పబ్లిక్ విజబులిటీ కనిపించేలా పనులు చేయాలని చూస్తుంది. మూసీ పునరుజ్జీవం పూర్తయితే ఎలా ఉంటుందో చెప్పేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంపై కీలక ఆదేశాలిచ్చారు. ముందుగా.. బాపూఘాట్ దగ్గర ప్రతిపాదిత గాంధీ సరోవర్, మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న ఆధునిక బ్రిడ్జి పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి కన్సల్టెంట్లు రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో సీఎంకి వివరించారు అధికారులు.
మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఈలోగా.. అవసరమైన సర్వేలు, నివేదికలు, డిజైన్లతో కూడిన పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన మీరాలం బ్రిడ్జిని అద్భుతంగా రూపొందించాలని సీఎం సూచించారు. మీర్ ఆలం ట్యాంక్‌లోని మూడు ఐలాండ్లను సింగపూర్ తరహా పర్యాటక కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు. వీటిని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలన్నారు. బర్డ్స్ పారడైజ్, వాటర్‌ఫాల్స్ లాంటి ఆకర్షణీయమైన వాటితో పాటు వెడ్డింగ్ డెస్టినేషన్స్, అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్, బోటింగ్, రిసార్ట్‌లు, హోటల్స్ అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
నీటి ప్రవాహాన్ని, లభ్యతను దృష్టిలో ఉంచుకొని డిజైన్లు రూపొందించాలని సూచించారు సీఎం రేవంత్. హైడ్రాలజీ, పర్యావరణ అంశాల్లో నిపుణుల సలహాలతో సర్వేలు జరిపించి, అవసరమైన అనుమతులు పొందాలన్నారు. మీరాలం ట్యాంక్ పక్కనే ఉన్న జూ పార్క్‌కు ఈ అభివృద్ధిని అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. జూ అధికారులతో చర్చించి, నిబంధనల మేరకు జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ అన్నారు.
మూసీ పునరుజ్జీవంపై ముందుకే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు సీఎం రేవంత్. మూసీ పక్కన అభివృద్ధి ఎలా ఉండబోతుందనేది కళ్లకు కట్టేలా నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా ప్రజామోదం పొంది.. మూసీ పునరుజ్జీవంను పూర్తి చేయాలని చూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..