గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్.. కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి!
గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడ లేని విధంగా గిగ్ వర్కర్ భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే డే రోజున చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టం తయారు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్మిక శాఖ సిద్ధం చేసిన బిల్లు ముసాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు, యూనియన్ నేతలతో చర్చించారు. ముసాయిదాలో పొందుపరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. ముసాయిదాకు సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు చేర్పులు సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా చట్టం ఉండాలని సీఎం సూచించారు.
ముసాయిదాను ఆన్‌లైన్‌లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్ పోర్ట్, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ నాటికి తుది ముసాయిదా సిద్ధం చేయాలని ఆదేశించారు. మే1న కార్మిక దినోత్సవాన చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖకు సీఎం ఆదేశించారు.
దేశంలోనే మొదటి సారి గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..