AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chevella: ముక్కుపచ్చలారని పసి తల్లులు.. ఎట్టా తీసుకెళ్లాలనిపించింది దేవుడా..?

చేవెళ్ల మండలం దామరగిద్దలో ఇద్దరు చిన్నారులు పార్క్ చేసిన కారులో ఇరుక్కుని.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబ ఆవేదనకు అంతులేకుండా పోయింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chevella: ముక్కుపచ్చలారని పసి తల్లులు.. ఎట్టా తీసుకెళ్లాలనిపించింది దేవుడా..?
Car (Representative image)
Ram Naramaneni
|

Updated on: Apr 14, 2025 | 6:05 PM

Share

 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  కారు డోర్లు లాక్‌ అవడంతో లోపల ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే…  చేవెళ్ల మండలం పామన గ్రామానికి చెందిన వెంకటేష్ జ్యోతి దంపతుల కూతురు తన్మయ శ్రీ (5), షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కూతురు అభినయశ్రీ (4) మరణించడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిపోయాయి. చనిపోయిన తన్మయశ్రీ, అభినయశ్రీ వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు ఈ నెల 30న తమ మేనమామ వివాహం ఉండడంతో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన పిల్లలు.. ఈ విధంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

బాలికలు ఇద్దరూ.. ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. వారు ఎక్కిన తర్వాత డోర్లు లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఇరుక్కుపోయిన చిన్నారులు ఊపిరి అందక ఈ లోకాన్ని వీడారు.  బాలికలు చాలాసేపటి నుంచికనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతమంతా వెతికినా కనిపించలేదు. చివరకు కారులో అపాస్మారక స్థితిలో కనిపించడంతో.. వెంటనే  ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

చిన్నారులు మృతి చెందారనే విషయం తెలిసి.. ఆ గ్రామమంతా తల్లడిల్లిపోయింది. చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపించడం చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. లోకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఓ కాపు కాస్తూ ఉండాలి. లేదంటే ఇలాంటి దారుణాలే జరుగుతాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు