Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

కాంగ్రెస్ అంటేనే నిలదీతలు.. నినాదాలు కామన్‌. కానీ మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఇవేవీ కనిపించలేదు. అంజన్‌ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే.. జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Congress: పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
Cm Revanth Reddy
Ravi Kiran
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 25, 2025 | 1:05 PM

Share

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం హాట్‌గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజికవర్గమంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్నారాయన. సిటీలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తమకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. తన పాత్ర కీలకంగా ఉందన్నారు. ఇండైరెక్ట్‌గా తనకు పదవి ఇవ్వాలని కోరారు అంజన్‌ కుమార్ యాదవ్‌. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్‌ను పొగుడుతూనే సున్నితంగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ అదృష్టవంతుడన్నారు. ఆయన టైమ్ బావుందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పీఏసీలో రేవంత్‌ను ఎవరూ ఎదురు ప్రశ్నించలేదన్నారు. నేతలను బాగా సమన్వయం చేశారంటూ కితాబిచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనకంటే రేవంత్ ఏడాదిన్నర పాలన బావుందన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఖుషీగా ఉన్నారని.. కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడా ఖుషీ చేయాలని సూచించారు జగ్గారెడ్డి. పదేళ్లు జేబులు ఖాళీ చేసుకున్న కార్యకర్తలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్నారు జగ్గారెడ్డి. కార్యకర్తలు ఖుషీగా ఉంటేనే పథకాలు ప్రజల్లోకి చేరుతాయన్నారు.

నేతలంతా మాట్లాడింది విన్న సీఎం రేవంత్ రెడ్డి.. పీఏసీ మీటింగ్‌లో ఫైనల్ టచ్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దన్నారు. పదవులు అడగడం తప్పుకాదన్నారు. అలాగని పదవుల కోసం ధర్నాలు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి పీసీసీ దృష్టికి తీసుకురావాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విషయంలోనూ తమకే టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్న కొందరు నేతలకు చురకలంటించారు ముఖ్యమంత్రి. ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకోవద్దన్నారు. హైకమాండ్ మార్గదర్శకాల మేరకు పనిచేసే నేతలకు, కార్యకర్తలకే పార్టీలో భవిష్యత్ ఉంటుందంటూ కొంచెం గట్టిగానే హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో