Telangana: ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది’.. సీఎం సహా మరో మంత్రి కీలక వ్యాఖ్యలు..

| Edited By: Srikar T

Apr 24, 2024 | 4:23 PM

కాంగ్రెస్ పార్టీలో అర్హతలు ఉన్న సీఎం కావడం పెద్ద కష్టమే. పార్టీలో ప్రతి లీడర్ తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెబుతుంటారు. ఆ లీడర్లు కూడా సీఎం పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. సీనియర్ నేతలు సీఎం పదవి రేసులో ఉన్నప్పటికీ చివరికి రేవంత్‎ను ఆ పదవి వరించింది. పార్లమెంట్ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి సీఎం పదవి అర్హతల అంశం చర్చకు వచ్చింది.

Telangana: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది.. సీఎం సహా మరో మంత్రి కీలక వ్యాఖ్యలు..
Congress Party
Follow us on

కాంగ్రెస్ పార్టీలో అర్హతలు ఉన్న సీఎం కావడం పెద్ద కష్టమే. పార్టీలో ప్రతి లీడర్ తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెబుతుంటారు. ఆ లీడర్లు కూడా సీఎం పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. సీనియర్ నేతలు సీఎం పదవి రేసులో ఉన్నప్పటికీ చివరికి రేవంత్‎ను ఆ పదవి వరించింది. పార్లమెంట్ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి సీఎం పదవి అర్హతల అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని అన్నారు. వెంకట్‌రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు.

నల్లగొండలో పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద ర్యాలీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వేదికపై ఉన్న వెంకట్‌రెడ్డి తనపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకు సీఎం పదవిపై ఆశ లేదని, సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నాపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అభిమానంతో అలా మాట్లాడారని అన్నారు. 30 ఏళ్లుగా నల్లగొండ ప్రజలు రాజకీయంగా అభిమానం చూపుతూ గెలిపిస్తూ వచ్చారని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన తనకు పదవులపై ఆశ లేదని చెప్పారు. తనపై నల్లగొండ ప్రజలు చూపిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న మంత్రి పదవి చాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..