AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్‌ కరీంనగర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఆ పర్యటన వాయిదా పడినట్టు....

సీఎం కేసీఆర్‌ కరీంనగర్ పర్యటన వాయిదా
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2020 | 6:29 AM

Share

తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఆ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగు, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని, కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు.. సీఎం కేసీఆర్‌ తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి సహా కరీంనగర్ లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పలు మార్లు ముఖ్యమంత్రి ఆరాతీశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు సీఎం స్వయంగా కరీనంగర్ పట్టణంలో పర్యటించాలని తొలుత భావించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరీంనగర్ లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో అధికార యంత్రాంగం సీఎంకు భరోసానిచ్చారు. తాజా పరిస్థితుల్లో పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

Follow Us
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే